పెళ్లి పేరుతో రూ.9.35 కోట్లు స్వాహా.. బిగ్ బాస్ బ్యూటీ క్లారిటీ !!
సోషల్ మీడియా సెన్సేషన్, తెలుగు బ్యూటీ "అషూ రెడ్డి" గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా టిక్‌టాక్ వీడియోల ద్వారా విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకోవడమే కాకుండా.. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి ఎంట్రీ కూడా ఇచ్చింది. హౌస్‌లో ఎక్కువ కాలం కొనసాగలేకపోయినా కానీ.. షో తర్వాత కూడా ఆమె ఏ మాత్రం తగ్గలేదు.
ఆ తర్వాత వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ఆమెకు విపరీతమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. అలా యాంకర్‌గా, నటిగా బిజీగా ఉన్న అషు రెడ్డి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫోటోషూట్స్, వీడియోలతో అభిమానులను అలరిస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ బిగ్ బాస్ బ్యూటీపై కేసు నమోదు కావడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.

ఏం జరిగిందంటే..
పెళ్లి పేరుతో మోసం చేసి కోట్ల రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS)లో ఆమెపై కేసు నమోదైంది. షేక్‌పేట్‌కు చెందిన వ్యాపారవేత్త సత్యనారాయణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. తన కొడుకును పెళ్లి పేరుతో నమ్మించి అషురెడ్డి, ఆమె కుటుంబ సభ్యులు కలిసి సుమారు రూ.9.35 కోట్ల వరకు నగదు, ఆస్తులు తీసుకున్నారని ఆరోపించారు. పలుమార్లు నగదు రూపంలో డబ్బులు తీసుకున్నారని.. లగ్జరీ కార్లు కొనుగోలు చేయించుకున్నారని, ఫ్లాట్లు, బంగారం కూడా తమ డబ్బులతోనే తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు.
అయితే పెళ్లి పేరుతో దగ్గరైన తర్వాత వివాహంపై స్పష్టత ఇవ్వకుండా ఎప్పటికప్పుడు కారణాలు చెబుతూ వాయిదా వేస్తున్నారని సత్యనారాయణ ఆరోపించారు. పెళ్లి ప్రస్తావన వస్తే తప్పించుకుంటున్నారని, చివరకు మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించామని తెలిపారు. ఈ ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలపై వివరాలు సేకరిస్తూ, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు, ఆస్తుల కొనుగోళ్లపై విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ ఘటన బయటకు రావడంతో సోషల్ మీడియాలో విస్తృత చర్చ మొదలైంది. కొందరు ఇది నిజమైతే కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడుతుండగా, మరికొందరు పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే వరకు ఆగాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే అషు రెడ్డి ఇన్ స్టా వేదికగా ఇన్ డైరెక్ట్ గా ఈ ఘటనపై స్పందించారు. తనపై వస్తున్న వార్తలు అబద్ధమని.. తన అనుమతి లేకుండా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానని స్టోరీలో రాసుకొచ్చారు.













Click it and Unblock the Notifications