సలార్ విషయంలో వేణు స్వామి చెప్పిందే జరిగిందిగా..!

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట్లో వేణు స్వామి చెప్పిన మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాని సమంత నాగ చైతన్యలు తమ వివాహిక జీవితానికి గుబ్ బై చెబుతారని..మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకుంటుందని ముందే చెప్పి సంచలనం వేణు స్వామి సృష్టించారు. ఆయన చెప్పినట్టుగానే సమంత నాగ చైతన్యలు విడిపోవడం, నిహారిక తన భర్త చైతన్యకు విడాకులు ఇవ్వడం వంటివి చక చక జరిగిపోయాయి.

ఇక ప్రభాస్ విషయంలో వేణు స్వామి మొదటి నుంచి కూడా నెగిటివ్‌గానే చెబుతూ వస్తున్నారు.బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన ఏ సినిమా అయిన ఫ్లాప్ అవుతుందని వేణు స్వామి తెలిపారు. ఆయన చెప్పినట్టుగానే సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. సలార్ కూడా ఫ్లాప్ అవుతుందని.. ప్రభాస్ జాతకంలో హిట్ ఇప్పట్లో లేదని వేణు స్వామి కుండబద్ధలు కొట్టేశారు.

Astrologer Venu Swamy predictions come true Prabhas salaar movie

అయితే సలార్ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోయింది. సినిమా హిట్ కావడంతో ప్రభాస్ అభిమానులు సంబంరాలు చేసుకున్నారు. ఇదే సమయంలో వేణు స్వామిని టార్గెట్ చేసుకుని అభిమానులు సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా కామెంట్స్ కూడా పెట్టారు. కానీ సలార్ తాజా లెక్కలు చూస్తుంటే మాత్రం వేణు స్వామి ఈ సినిమా విషయంలో వేణు స్వామి చెప్పిందే నిజం అయ్యేట్టుగా ఉన్నాయి.

సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 345 కోట్లు బిజినెస్ నమోదు చేసుకుంది.బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.347 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్, సుమారు రూ.700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టాలి. ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ బట్టి చూస్తే.. ఈ సినిమా ఇంకా రూ.34 కోట్ల షేర్‌ని అంటే రూ.68 కోట్ల గ్రాస్ ని అందుకోవాల్సి ఉంది. దీనిని బట్టి చూస్తే సలార్ ఇంకా లాభాల్లోకి రావాల్సి ఉందని లెక్కలు చెబుతున్నాయి.

Astrologer Venu Swamy predictions come true Prabhas salaar movie

తెలుగు , హిందీ భాషల్లో లాభాల్లో ఉన్న సలార్.. తమిళనాడు, కర్నాటకకు వచ్చే సరికి భారీ నష్టాల్లో సాగుతుంది. మన భాషలో చెప్పాలంటే ఈ రెండు రాష్ట్రాల్లో సలార్ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ వారం తరువాత సంక్రాంతి సినిమాలు బరిలోకి దిగనుండటంతో సలార్ లాభాల్లోకి రావడం కష్టమే అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. వచ్చే ఆదివారంతో సలార్ సందడి ఆగిపోనుంది. ఈలోపు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాల్సి ఉంది. దీనిని బట్టి చూస్తే ప్రభాస్ సలార్ విషయంలో వేణు స్వామి చెప్పిందే నిజం అయిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+