టాలీవుడ్ లో ఆరంగేట్రం.. హాలీవుడ్ లో సెన్సేషన్ అవంతిక వందనపు!!

టాలీవుడ్ లో మహేష్ బాబు తో నటించిన అవంతిక వందనపు ఇప్పుడు హాలీవుడ్లో ఊహించినంత బిజీ అయ్యారు. బాలనటిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటించిన అవంతిక వందనపు ప్రస్తుతం హాలీవుడ్ లో సెన్సేషన్ గా మారారు. సినిమాలలోకి టాలీవుడ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇప్పుడు హాలీవుడ్లో వరుస సినిమాలలో బిజీగా మారారు.

అవంతిక వందనపు.. మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమాలో బాలనటిగా నటించారు. తన డాన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు. తెలుగు మూలాలున్న కుటుంబంలో కాలిఫోర్నియాలో 2005లో పుట్టి అక్కడే పెరిగిన అవంతిక వందనపు చదువుకుంటూనే నటనలో శిక్షణ తీసుకున్నారు. యాక్టింగ్ తో పాటు కూచిపూడి నాట్యం, కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను రాణించారు.

Avantika Vandanapu Entry in Tollywood.. sensation in Hollywood !!

తెలుగు, హిందీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషలు మాట్లాడగలరు. బ్రహ్మోత్సవం సినిమా మాత్రమే కాకుండా అవంతిక వందనపు మనమంతా, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, ఆక్సిజన్, బాలకృష్ణుడు, అజ్ఞాతవాసి తదితర చిత్రాలలోనూ బాలనటిగా అందరిని మెప్పించారు.
2014లో ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్స్ నార్త్ అమెరికన్ ఎడిషన్ లో రన్నరప్ గా నిలిచారు.

ఆపై తెలుగు చిత్ర పరిశ్రమ ద్వారానే సినీరంగంలో అరంగేట్రం చేసిన ఆమె అనేక సినిమాలలో ఆఫర్లు అందుకున్నారు. తెలుగు చిత్రాలలో హీరోయిన్ గా నటించే అవకాశాలు రాగా గ్లామర్ పాత్రలు పోషించే ఆసక్తి ప్రస్తుతానికి తనకు లేదని వాటిని తిరస్కరించారట అవంతిక వందనపు.

హాలీవుడ్ సినిమాలలో ప్రస్తుతం బిజీగా ఉన్న అవంతిక వందనపు హాలీవుడ్ యానిమేషన్ సిరీస్ లు మీరా: రాయల్ డిటెక్టివ్, డైరీ ఆఫ్ ఏ ఫ్యూచర్ ప్రెసిడెంట్ లోని పాత్రలకు గాత్రదానం చేశారు. హాలీవుడ్లో నటించాలన్న ఆమె ఆశకు డిస్నీ సంస్థ ఊపిరి పోసింది. స్పిన్ చిత్రంతో ఆమె కల నెరవేరింది. ఆ తర్వాత మరొక సినిమా సీనియర్ ఇయర్ లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం హారర్ స్కోప్, ఏ క్రౌన్ విషెస్ చిత్రాలలో నటిస్తోంది అవంతిక వందనపు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+