బాబాయ్ అని నమ్మితే నడి రోడ్డు మీద నా చెస్ట్‌పై అలా చేశాడు
ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి వివరించింది.
టాలీవుడ్ యువ నటి, 'ముఖ్య చిత్రం', 'ఓం భీమ్ బుష్' వంటి చిత్రాలతో మెప్పించిన అయేషా ఖాన్..బిగ్‌బాస్ షోలో పాల్గొని ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన చిన్నతనంలో ఎదురైన భయంకరమైన లైంగిక వేధింపుల అనుభవాన్ని పంచుకుంది.నేను చాలా చిన్న వయసులోనే లైంగిక వేధింపులకు గురయ్యాను అంటూ మొదలుపెట్టిన అయేషా, ఆ రోజు జరిగిన చేదు సంఘటనను గుర్తు చేసుకుంది.

ఒకసారి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే, మా నాన్నగారి స్నేహితుడు ఒకరు నన్ను పిలిచారు. ఆయనను నేను 'బాబాయ్' అని పిలిచేదాన్ని. ఆయన స్కూటర్‌పై వచ్చి, నన్ను చూస్తూ... నా వక్షోజాలు చాలా బాగున్నాయని అత్యంత అసభ్యకరంగా మాట్లాడాడు. ఆయన మాటలకు షాక్‌లో ఉండిపోయాను. అంతటితో ఆగకుండా, మళ్లీ వెనక్కి వచ్చి నాకు కన్ను కొట్టి, అసభ్యంగా సైగలు చేశాడు."
ఆయన ఎందుకు అలా మాట్లాడాడో, ఆ సైగల అర్థమేమిటో కూడా తెలియని చిన్న వయసు అది. వెంటనే ఇంటికి వెళ్లి కూర్చుని ఏడ్చేశానని, ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుకొస్తే కన్నీరు ఆగవని, చాలా బాధగా ఉంటుందని అయేషా ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
ఒక సెలబ్రిటీకే ఇలాంటి చేదు అనుభవం ఎదురైతే, సాధారణ మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ సంఘటన కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. తమకు రక్షణగా ఉండాల్సిన 'బాబాయ్' లాంటి వ్యక్తే ఇలా కీచకుడిగా మారడం సమాజంలో నెలకొన్న భద్రతా లేమిని ప్రశ్నిస్తోంది. ప్రస్తుతం అయేషా ఖాన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి, మహిళల భద్రతపై చర్చను రేకెత్తిస్తున్నాయి.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications