'బాహుబలి: ది ఎపిక్'లో 80 శాతం కొత్త సీన్లు..? పండగ చేస్కోండి..

బాహుబలి మూవీ వచ్చి 10 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఆ పాత్రలు, మ్యూజిక్, దర్శక ధీరుడు రాజమౌళి విజన్ మాత్రం చాలా మందికి ఇంకా గుర్తే ఉంది. అంతలా ఆ మూవీ అద్భుతం క్రియేట్ చేసింది. అటు బాక్సాఫీస్ పరంగా.. ఇటు ప్రేక్షకుడి అనుభూతి పరంగా ఇలాంటి మూవీ న భూతో న భవిష్యత్ అన్నట్లే. ఈ మూవీ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసింది. రిలీజైన అన్ని ప్రాంతాల్లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా మూవీ నిలిచింది. అయితే ఈ హిస్టారికల్ ఎపిక్ రీ రిలీజ్ కాకుండా రెండు పార్టులను ఒకే పార్టుగా విడుదల చేస్తామని దర్శక ధీరుడు రాజమౌళి ఇటీవల ప్రకటించారు. దీంతో అందరికీ మరోసారి ఈ మూవీని బిగ్ స్క్రీన్ పై ఎంజాయ్ చేయాలని ఆసక్తి నెలకొంది.

అయితే ఈ మూవీ రన్ టైమ్ టైమ్ పై సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే నడుస్తోంది. 4 గంటలు అని కొంత మంది లేదు.. 5 గంటలు అని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ఇదే విషయంపై భల్లాల దేవుడు రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ఈ మూవీ రన్ టైమ్ ఎంత ఉన్నా నాకు చాలా ఆనందమే అన్నారు. ఎందుకంటే ఈ ఏడాదిలో నేను ఏ మూవీలోనూ యాక్ట్ చేయకుండానే నాకు బ్లాక్ బస్టర్ రానుందని తెలిపారు. మరోవైపు బుక్ మై షో ప్ర‌కారం ఈ సినిమా ర‌న్ టైమ్ 5 గంట‌ల 27 నిమిషాలుగా ఉంది.

Baahubali Buzz Viral Rumor Claims 80 New Scenes in The Epic

మరోవైపు ఈ మూవీలో దాదాపు 80 శాతం కొత్త సీన్లు ఉంటాయని మరో రూమర్ నెట్టింట వైరల్ అవుతోంది. బాహుబలి 1 , 2 రిలీజ్ సమయంలోనూ రాజమౌళి చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. రన్ టైమ్ సమస్య కారణంగా చాలా సీన్లు తొలగించామని అన్నారు. వీటన్నింటినీ ఇప్పుడు బాహుబలి ఎపిక్ లో జోడించనున్నట్లు సమాచారం. అందుకే రన్ టైమ్ 4 గంటలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఇది నిజమా కాదా అని తెలియాలంటే మూవీ రిలీజ్ అయ్యేంత వరకూ ఆగాల్సిందే.

బాహుబలి మూవీ రెండు భాగాలుగా తెరకెక్కింది. చిత్రం తొలి భాగం లిభాగం 2015 జులై 10న విడుదలై భారతీయ సినీ చరిత్రలోనే అనేక రికార్డులు సాధించింది. ఆ తర్వాత పార్ట్-2 2017లో రిలీజై తెలుగు సినిమా ఖ్యాతిని మరోస్థాయికి తీసుకెళ్లింది. బాహుబలిగా ప్రభాస్‌, భళ్లాలదేవగా రానా, దేవసేనగా అనుష్క, శివగామిగా రమ్యకృష్ణ, అవంతికగా తమన్నా, కట్టప్పగా సత్యరాజ్‌ పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ క్రమంలో బాహుబలి ది ఎపిక్ మూవీ ఈ ఏడాది అక్టోబ‌ర్ 31న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా రీ రిలీజ్ లోనూ రికార్డు కలెక్షన్స్ రాబడుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+