పేరుకే "బ్యాడ్ గర్ల్స్".. కానీ లోపల మ్యాటర్ వేరే..!
30 రోజుల్లో ప్రేమించడం ఎలా' చిత్రంతో విజయం సాధించిన దర్శకుడు మున్నా ధులిపూడి నుంచి వస్తున్న కొత్త చిత్రం 'బ్యాడ్ గాళ్స్'. దీని ట్యాగ్ లైన్ 'కానీ చాలా మంచోళ్లు'. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్‌ను గ్రాండ్ ప్రెస్‌మీట్‌లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకులు చందూ మొండేటి, శివ నిర్వాణ, కృష్ణ చైతన్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
దర్శకుడు మున్నా మాట్లాడుతూ ఈ సినిమా వెనుక ఉన్న స్ఫూర్తిని వివరించారు. "అమ్మాయిలకు పెళ్లి తర్వాత స్వేచ్ఛ ఉండదని, పెళ్లి ముందు ఆఖరి రోజును ఆస్వాదించడానికి వచ్చిన ఒక అమ్మాయి కథ ఈ సినిమాకు స్ఫూర్తినిచ్చింది. ఈ కథను ఐదుగురు పెద్ద నిర్మాతలకు చెప్పినా, కొత్తవారితో మార్కెట్ అవుతుందా అని సందేహించారు. అందుకే నా క్లాస్‌మేట్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మించాం" అని తెలిపారు. "అమ్మాయిలను భయంతో కాదు, ధైర్యంతో పెంచాలి" అని చెప్పే కథ ఇది. అలాగే, అమ్మాయిల రక్షణ కోసం పాఠశాలల్లో 'సెల్ఫ్ డిఫెన్స్'ను ఒక సబ్జెక్ట్‌గా పెట్టాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరూ ఈ చిత్రానికి అభినందనలు తెలిపారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ, 'నీలి నీలి ఆకాశం' తర్వాత మున్నాతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని, ఈ సినిమాలో కూడా అలాంటి అద్భుతమైన పాట ఉందని తెలిపారు. నిర్మాతలు, నటులు, సాంకేతిక నిపుణులందరూ సినిమా విజయంపై నమ్మకం వ్యక్తం చేశారు. రేణూ దేశాయ్ కూడా సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించారని మున్నా వెల్లడించారు. ఈ సినిమా ప్రతి ఫ్యామిలీ చూడాల్సిన కథ అని నిర్మాతలు అన్నారు.












Click it and Unblock the Notifications