ఫస్ట్ డే రికార్డ్స్ బ్రేక్ చేసిన "బాహుబలి ది ఎపిక్".. ఎన్ని కోట్లు వచ్చాయంటే ??
తెలుగు చిత్ర పరిశ్రమను "బాహుబలి" చిత్రానికి ముందు.. ఆ తర్వాత అంటూ వర్ణించడంలో అసలు తప్పే లేదు. దర్శక ధీరుడు జక్కన్న తెరకెక్కించిన ఈ మూవీ భారతీయ సినిచరిత్రలో ప్రభంజనం సృష్టించింది. 2015లో 'బాహుబలి: ది బిగినింగ్', 2017లో 'బాహుబలి: ది కన్‌క్లూజన్' పేర్లతో విడుదలై భారీ వసూళ్లను రాబట్టి కలెక్షన్స్ వర్షం కురిపించడమే కాకుండా రికార్డులు తిరగరసింది. బాహుబలి: ది కన్‌క్లూజన్' ప్రపంచవ్యాప్తంగా రూ. 1800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించి భారతీయ సినిమా చరిత్రలో అగ్రస్థానంలో నిలిచింది.
అయితే టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ జోరుగా నడుస్తోంది. స్టార్ హీరోల పుట్టిన రోజులు సహా పలు సందర్భాలను పురస్కరించుకొని సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా బాహుబలి మూవీ రెండు పార్టులను కలిపి.. 'బాహుబలి - ది ఎపిక్' పేరుతో విడుదల చేశారు. కాగా పదేళ్ల తర్వాత కూడా అదే క్రేజ్‌ను కొనసాగిస్తూ రికార్డులను తిరగరసింది ఈ చిత్రం. స్క్రీనింగ్‌ను చూస్తున్న ప్రేక్షకులు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పలు సీన్స్ రీ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

రికార్డు కలెక్షన్స్..
ఇక బాహుబలి: ది ఎపిక్ మూవీ మొదటి రోజే రూ. 10.4 కోట్ల నెట్, రూ. 18 కోట్ల గ్రాస్ కలెక్షన్‌ను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రీ-రిలీజ్ అయిన చిత్రాల్లో ఇంత భారీ వసూళ్లు రాబట్టడం ఇదే తొలిసారి అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దళపతి విజయ్ "గిల్లీ" రూ. 10 కోట్లు.. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ రూ. 8 కోట్లు.. మహేష్ బాబు బిజినెస్‌మెన్ రూ. 5.27 కోట్లు సాధించాయి. అలానే మురారి చిత్రం సైతం రూ. 5 కోట్లు వసూళ్లను సంపాదించింది. అయితే బాహుబలి ఒకే రోజులో ఈ రికార్డులన్నింటినీ అధిగమించి కొత్త చరిత్ర సృష్టించిందని అంటున్నారు.
మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇంత వరకు ఏ అప్డేట్ ని అధికారికంగా మూవీ యూనిట్ రిలీజ్ చేయలేదు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయకుండానే సెట్స్ మీదకు తీసుకెళ్లారు. SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం.
ఈ సినిమా కోసం ఇప్పటి వరకు ఎప్పుడు లేని విధంగా మహేష్ సరికొత్త లుక్‌లోకి మారాడు. జుట్టు పెంచి గుబురు గడ్డంతో, జిమ్‌లో వర్కౌట్ చేసి మరింత ఫిట్ అయ్యాడు. దీంతో ఆయన లుక్ సినిమాలో ఎలా ఉండబోతుంది అనే హాట్ టాపిక్ నడుస్తోంది. నవంబర్ 16న మూవీ టైటిల్, పోస్టర్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications