ఓటీటీలో బాలకృష్ణ భగవంత్ కేసరి.. ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే!!
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన చిత్రం భగవంత్ కేసరి. ఈరోజు విడుదలైన ఈ సినిమాకు బాలయ్య అభిమానులు ఫిదా అవుతున్నారు. సినిమాలో బాలయ్య కొత్తగా కనిపించారని, అనిల్ రావిపూడి ఈ సినిమాను భిన్నంగా తీశారని చెబుతున్నారు. థియేటర్లో రిలీజైన ఈ సినిమా దేశవ్యాప్తంగా సందడి చేస్తుంటే, ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందా అని ఆశగా చాలామంది స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్నారు.
నందమూరి నటసింహం బాలయ్య బాబు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా భగవంత్ కేసరి థియేటర్లో రిలీజ్ అయిన తొలి నాడే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. తండ్రి కూతుర్ల సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణకు కూతురుగా శ్రీ లీల నటించగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాను థియేటర్లలో చూడడానికి ఏ విధంగా అయితే అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారో, అదేవిధంగా ఓటిటిలో చూడడానికి కూడా ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. సినిమా ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి వస్తుంది అని ఎదురుచూస్తున్నారు. అయితే బాలకృష్ణ గత రెండు సినిమాలు అఖండ, వీర సింహారెడ్డి hotstar లో స్ట్రీమింగ్ అవుతుంటే, ప్రస్తుతం బాలయ్య బాబు నటించిన భగవంత్ కేసరి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం.
ఈ సినిమాకు ఫ్యాన్సీ ధర చెల్లించి amazon prime భగవంత్ కేసరి హక్కులు దక్కించుకున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా ఓ టి టి లోకి ఎప్పుడు వస్తుంది అని కూడా ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది. నేడు థియేటర్లో విడుదలైన ఈ సినిమా థియేటర్లో మూడు నాలుగు వారాలు నడిచిన తర్వాత ఓ టి టి లో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ దసరాకు బరిలోకి వచ్చిన భగవంత్ కేసరి సినిమా టార్గెట్ 65 కోట్లు కాగా, 66 కోట్లు వస్తే సినిమా హిట్ అని, పండుగ సమయంలో సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయని బయ్యర్లు భావిస్తున్నారు. మరి బాలయ్య సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్లు వసూలు చేస్తుందో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications