నారా బ్రాహ్మణి ఫేవరెట్ హీరో... బాలయ్య కాదు!
నారా బ్రాహ్మణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తెగా, చంద్రబాబునాయుడి కోడలిగా, నారా లోకేష్ భార్యగానే కాకుండా విజయవంతమైన పారిశ్రామికవేత్తగా గుర్తింపును తెచ్చుకుంది. హెరిటేజ్ సంస్థతోపాటు మరికొన్ని ఇతర వ్యాపారాలను సమర్థవంతంగా నడుపుతోంది. మొదటి నుంచి తాను తన తండ్రి బాలకృష్ణకు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. బాలయ్య ప్రతి సినిమాను వదిలిపెట్టకుండా చూసేది. చిన్నప్పుడైతే మొదటిరోజు మొదటి షో చూడాల్సిందే అని పట్టుబట్టేదని బాలయ్య ఓ సందర్భంలో చెప్పారు.
రామ్ చరణ్ కూడా మంచి నటుడు
అయితే బ్రాహ్మణికి బాలయ్య కాకుండా ఇష్టమైన మరో హీరో ఉన్నారు. అతనెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి నటన, నృత్యాలు, పోరాటాలు అంటే తనకు ఎంతో ఇష్టం. సినిమా విడుదలైన మొదటిరోజు అని కాకుండా తనకు వీలున్నరోజు చూసుకొని చిరంజీవి ప్రతి సినిమా బ్రాహ్మణి చూస్తుంది. తర్వాత చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నటన అంటే కూడా ఆమెకు బాగా ఇష్టం. రామ్ చరణ్ డైలాగులు, రోజురోజుకు నటనలో అతని మెచ్యూరిటీ చాలా ఇష్టమని చెప్పింది. స్వతహాగా రామ్ చరణ్ మంచి నటుడు కావడంతో సాధారణంగానే అందరూ అతని నటనను ఇష్టపడతారు. ప్రస్తుతం బ్రాహ్మణికి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది.

యువ హీరోలు కూడా పోటీపడలేరు
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఢాకూ మహారాజ్ చిత్రం చేస్తున్నారు. సితార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానరుపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. వాస్తవానికి ఈ చిత్రాన్ని విజయదశమికే విడుదల చేయాలనుకున్నారుకానీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో ఆ సమయంలో బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా పోటీచేస్తూ బిజీగా ఉండటంతో సినిమా షూటింగ్ ఆలస్యమైంది. వరుసగా మూడు హ్యాట్రిక్ హిట్లు సాధించిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయితే బాలయ్యతో పోటీపడటం యువ స్టార్ హీరోలకు కూడా కష్టంగా మారుతుంది.












Click it and Unblock the Notifications