బ్రేకింగ్ న్యూస్: మహారాజుగా బాలకృష్ణ
నందమూరి నటసింహం బాలకృష్ణ చాలా జోరుమీద ఉన్నారు. వరుసగా 4 హిట్లు ఇచ్చి అఖండ2 ద్వారా 5వ హిట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా డిసెంబరులో విడుదల కానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటించిన 4వ సినిమా ఇది. కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు మంచి అంచనాలతో ఉన్నారు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తోపాటు సోషల్ ఎలిమెంట్స్ కలిసివుంటాయని చెబుతున్నారు. ఈ సినిమాలో బాలయ్య మహారాజు పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది.
నిజమైన కోటలు ఉంటే మంచిదని..
మొదటి నుంచి బాలయ్యకు కూడా పౌరాణిక, జానపద పాత్రలు అంటే చాలా ఇష్టం. ఆదిత్య 369, శ్రీకృష్ణార్జున విజయం, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలు చేశారు. అప్పుడప్పుడు ఈ సినిమాల గురించే మాట్లాడుతుంటారు. గోపీచంద్ తయారుచేసిన కథ ప్రకారం హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ ఉండబోతోంది. అటువంటి బ్యాక్ డ్రాప్ ఉండాలంటే అందుకు తగినట్లు మంచి పాత్ర ఉండాలి. ఆ పాత్రనే మహారాజుగా బాలయ్య పోషించబోతున్నారు. ఈ సినిమా కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సెట్టింగ్స్ వేసేకన్నా వాస్తవంగా ఉండే కోటల దగ్గరే చిత్రీకరించాలని దర్శకుడు భావిస్తున్నారు.

మొరాకాలో అన్వేషణ
అటువంటి నిజమైన కోటల కోసం అన్వేషిస్తున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా మొరాకోలోని కొన్ని కోటల్లో సన్నివేశాలను చిత్రీకరించారు. అక్కడికే గోపీచంద్ బృందం వెళ్లివచ్చింది. వీటితోపాటు కొత్త లోకేషన్స్ కోసం కూడా అన్వేషిస్తున్నారు. ఈ సినిమాకు కూడా తమన్ సంగీతం అందించే అవకాశం ఉంది. సతీష్ కిలారు నిర్మాతగా వ్యవహరించనున్నారు. హీరోయిన్ ను ఇంకా ఖరారు చేయలేదు. ఒక విభిన్నమైన సబ్జెక్ట్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని, అన్నిరకాల జానర్లలో తాను సినిమాలు చేయగలను అని నిరూపించుకోవాలనే పట్టుదలతో గోపీచంద్ మలినేని ఉన్నారు.












Click it and Unblock the Notifications