బాలయ్యను అతని భార్య వసుంధర ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా?

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్నారు. సంక్రాంతికి విడుదలవుతుందని వార్తలు వస్తున్నాయికానీ చిత్ర యూనిట్ మాత్రం అధికారికంగా ధ్రువీకరించడంలేదు. ఈలోగా బాలయ్య అన్ స్టాపబుల్4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సూర్య హాజరయ్యారు. వరుసగా అతిథులు వస్తున్నారు. ఈలోగా పెండింగ్ లో ఉన్న 109వ సినిమా షూటింగ్ ను కూడా పూర్తిచేస్తారు. వాస్తవానికి బాలకృష్ణ చాలా భోళామనిషి అని అంటారు. పైకి ఎంత కోపంగా కనిపిస్తారో లోపల అతని మనసు అంత వెన్న అని బాలయ్య అభిమానులు చెబుతుంటారు.

హిందూపురంలో సమస్యలు పరిష్కరిస్తూ
బాలకృష్ణ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత అతని భార్య వసుంధర హిందూపురంలో తన భర్త తరఫున ప్రచారం నిర్వహించారు. అక్కడి ప్రజల సమస్యలను గుర్తిస్తూ వాటిని పరిష్కరిస్తున్నారు. సాధ్యమైనంతవరకు హిందూపురం ప్రజలకు వసుంధర ఎక్కువగా అందుబాటులో ఉంటున్నారు. ఈ భార్యాభర్తల మధ్య ఉన్న బంధం ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం తన తండ్రి తారకరామారావుతోపాటు తన భార్య వసుంధర కూడా కారణమని బాలయ్య ప్రతిసారీ చెబుతుంటారు. తాను పాల్గొనే ప్రతి కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తుంటారు.

Balayya is very politely called Srivaru by his wife Vasundhara

కుటుంబ విషయాలన్నీ చూసుకునేది
నాలుగు దశాబ్దాలుగా బాలయ్య సినీ పరిశ్రమలో హీరోగా కొనసాగుతున్నప్పటి నుంచి ఇంట్లో పిల్లలను పెంచడం, వారిని చదివించడం, వారి బాగోగులతోపాటు కుటుంబ విషయాలన్నింటినీ చూసుకునేది. తన భార్య గొప్పతనాన్ని బాలయ్య పొగుడుతుంటారు. ఇటీవలే చంద్రబాబునాయుడితో నిర్వహించిన అన్ స్టాపబుల్ షోలో కూడా ఈ విషయాలను బాలయ్య మరోసారి చెప్పారు. తన భార్య గొప్పతనాన్ని గురించి వివరించారు.

అందరిలో అదే సందేహం
అంత కోపంగా కనిపించి బాలకృష్ణను వసుంధర ఎలా చూస్తుంది? ఎలా వ్యవహరిస్తుంది? అనే సందేహం అందరిలో నెలకొంది. భార్యపై కోప్పడిన సందర్భాలు చాలా తక్కువని బాలయ్య అన్నారు. ఓ ఇంటర్వ్యూలో బాలయ్యను ముద్దుగా వసుంధర ఏమని పిలుస్తారు అనే ప్రశ్న ఎదురైంది. అయితే ఈ ప్రశ్నకు వసుంధర సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు. అయితే ఇంట్లో తన భర్తను ఏ ముద్దుపేర్లు లేకుండా పద్ధతిగా శ్రీవారు అని పిలుస్తారంట. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు పిచ్చి పిచ్చి పేర్లతో పిలుచుకునే ఈ జనరేషన్ లో కూడా ఎంతో పద్ధతిగా శ్రీవారు అని పిలవడం చాలా మంచి అలవాటు అని కొనియాడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+