Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇట్స్ అఫిషియల్.. ఇక 48 గంటలే.. 'అఖండ 2' రుద్ర తాండవమే..

నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న నాలుగో మూవీ 'అఖండ 2'.. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీని ఈ నెల 12 న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 11 న ప్రీమియర్స్ ఉంటాయని చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. త్వరలో బుకింగ్స్ ఓపెన్ అవుతాయని స్పష్టం చేసింది. ఈ నెల 5 న విడుదల కావాల్సిన ఈ మూవీ ఫైనాన్షియల్ వివాదాల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వివాదాలకు సంబంధించిన అడ్డంకులన్నీ తొలిగిపోయిన నేపథ్యంలో మూవీ రిలీజ్ కానుంది.

నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీను కాంబోలో ఇదివరకే వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. దాంతో అఖండ 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవల రిలీజైన ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఎప్పటిలాగే బాలయ్య భారీ డైలాగ్స్, ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ స్ తో ట్రైలర్ ఉత్కంఠభరితంగా ఉంది. ఈ మూవీలో బాలయ్య అఘోరా పాత్రలో నటవిశ్వరూపం చూపించారు. అయితే ఈ మూవీ ముందుగా అనుకున్న విధంగా డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల చివరి నిమిషంలో వాయిదా పడింది. రాత్రికి రాత్రే మూవీ వాయిదా పడడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.

Balayya s Thaandavam Unleashed Akhanda 2 Hits Screens on Dec 12 Official Alert

అయితే ఎట్టకేలకు డిసెంబర్ 12 న చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. డిసెంబర్ 11 న ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఈ మూవీలో బాలయ్య మళ్లీ డ్యూయల్ రోల్ పోషించారు. ఆయన సరసన మూవీలో సంయుక్త మీనన్ నటించారు. విలన్​ గా ఆది పినిశెట్టి నటించారు. ఇక ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్​ అందించారు. నందమూరి తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించింది. ఈ మూవీ తెలుగు, తమిళ​, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+