మహేష్ బాబుతో శవాల దగ్గర డాన్స్ చేయిస్తానంటున్న డైరెక్టర్..
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. చైల్డ్ ఆర్టిస్ట్ గానే సినిమాల్లో అదరగొట్టి.. యువరాజుతో హీరోగా ఆరంగేట్రం చేశారు. నాటి నుంచి తనదైన శైలిలో విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఇలా మహేష్ ఖాతాలో లేని సినిమా అంటూ లేదు. రీజినల్ ఫిల్స్ తోనే పాన్ ఇండియా చిత్రాలకు సైతం పోటీ ఇచ్చే స్థాయిలో తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు ఈ సూపర్ స్టార్.
అయితే ఛాన్స్ వస్తే మహేష్ బాబుతో మూవీ చేయాలని ప్రతి ఒక్క డైరెక్టర్ భావిస్తూ ఉంటారు. అయితే తనకు మాత్రం అవకాశం వస్తే మహేష్ బాబుతో రొటీన్ సినిమాలను కాకుండా చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తానని.. ఛాన్స్ ఉంటే శవాల దగ్గర డ్యాన్స్ చేసే పాత్రలో చూపిస్తానంటూ కామెంట్స్ చేశారు. అంతే కాకుండా మహేష్ బాబు పొటెన్షియాలిటీని బయటికి తీసే సినిమాలేవి ప్రస్తుతం రావడం లేదని చెప్పారు. ఒకే రకమైన పాత్రలు పోషిస్తూ మహేష్ ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తున్నాడని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఈ రేంజ్ లో మహేష్ బాబు గురించి బోల్డ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ ఎవరంటే.. బండి సరోజ్ కుమార్. యూట్యూబ్ లో నిర్బంధం, మాంగల్యం సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. నటుడుగానే కాకుండా దర్శకుడిగా కూడా తానేంటో నిరూపించుకుంటున్న ఈ యంగ్ డైరెక్టర్ ప్రస్తుతం తానే హీరోగా సినిమాలు చేసుకుంటున్నాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవకాశం వస్తే ఏ హీరోని ఎలా డైరెక్ట్ చేయాలని అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు.. మహేష్ గురించి ఈ విధంగా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు బండి సరోజ్ కుమార్ చేసిన కామెంట్స్ సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
ఇక ప్రస్తుతం మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నారు. SSMB29అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం. మహేష్ బాబు కెరీర్ ల లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. రీసెంట్ గానే ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఈ మూవీ షూటింగ్ లో ఓ షెడ్యూల్ పూర్తయింది. దీంతో మహేశ్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రాతో అక్కడి అభిమానులు ఆటోగ్రాఫ్స్ తీసుకున్నారు. సెట్‌లో మహేశ్, ప్రియాంక, రాజమౌళితో పలువురు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.












Click it and Unblock the Notifications