మళ్లీ రచ్చ లేపిన బండ్ల గణేష్.. ఒక్క హిట్టు కొట్టగానే అలా అంటూ ! !
బండ్ల గణేష్.. తెలుగు ప్రేక్షకులకు ఈయన గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. నటుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కమెడియన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. రవితేజ నటించిన ఆంజనేయులు మూవీతో నిర్మాతగా మారగా.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసి హిట్స్ అందుకున్నారు. గత కొంతకాలంగా సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో రెస్పాండ్ అవుతూనే ఉంటున్నారు.
కాగా బండ్ల గణేష్ సినిమాలకే కాదు ఆయన స్పీచ్ లకు కూడా సపరేట్ ఫాలోయింగ్ ఉంటారు. అది పొలిటికల్ స్పీచ్ అయినా, సినిమా ఈవెంట్ అయినా సరే తనదైన శైలిలో రచ్చ లేపుతుంటారు. రీసెంట్ గానే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం "K-ర్యాంప్" అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీతో జైన్స్ నాని దర్శకుడిగా పరిచయం అవ్వగా.. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. సాయి కుమార్, నరేష్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించగా.. అక్టోబర్ 18న దీపావళి కానుకగా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్ పై నిర్మాత రాజేష్ దండ నిర్మించగా.. మొదటి షో నుంచే పాజిటిక్ టాక్ తో హిట్ కొట్టింది.

ఈ మేరకు మూవీ యూనిట్ లేటస్ట్ గా సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి గెస్టుగా వచ్చిన బండ్ల గణేష్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో ఒక్క సినిమా హిట్ అయితే వాట్సప్ వాట్సప్ ఏం కావాలి అంటూ మాట్లాడతారని ఘాటుగా విమర్శించారు. అర్ధరాత్రి కూడా కళ్లద్దాలు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకుంటారని కామెంట్స్ చేశారు. కానీ హిట్ మీద హిట్టు కొడుతూ మన ఇంట్లో కుర్రాడిలాగా కిరణ్ అబ్బవరం మారిపోయారని ప్రశంసించారు.
అలానే ఇంకా మాట్లాడుతూ.. ఒక్క సినిమా హిట్ అయితే లూజు ప్యాంట్లు, కొత్త చెప్పులు, నెత్తి మీద క్యాప్, కళ్లద్దాలు పెట్టుకొని నడిచే ఈరోజుల్లో కిరణ్ రియల్ గా ఉన్నారని చెప్పుకొచ్చారు. కిరణ్ ని చూస్తుంటే చిరంజీవి గుర్తొస్తున్నారని.. ఒక్క హిట్ కొట్టగానే SS రాజమౌళిని తీసుకునిరా, లోకేష్ కనకరాజ్ ను తీసుకుని రా.. అనిల్ రావిపూడిని తీసుకుని రా అని చెప్పే హీరోలున్నారని ఫైర్ అయ్యారు. కానీ కిరణ్ మాత్రం కొత్త కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ పరిశ్రమకు తీసుకొస్తున్నాడని మెచ్చుకున్నారు. దీంతో బండ్ల గణేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఓ యంగ్ హీరో నుద్దేశించేనని కామెంట్స్ చేస్తున్నారు.
అంతకు ముందు బండ్ల గణేష్ 'లిటిల్ హార్ట్స్' సినిమా సక్సెస్ మీట్‌లో కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. హీరో మౌళి తనూజ్‌ని ఉద్దశించి మాట్లాడుతూ... ఇప్పుడు నీ సినిమా హిట్ అయింది కాబట్టి అందరూ నీ చుట్టూ తిరుగుతున్నారు. ఇది అంతా తాత్కాలికం. ఇరవై రోజుల మాయ. మహేష్ బాబు ట్వీట్ చేశాడు, విజయ్ దేవరకొండ షర్ట్ ఇచ్చాడు అని ఆనందపడకు. ఇవన్నీ సక్సెస్ వలన వచ్చే సీన్‌లు" అంటూ చెప్పుకొచ్చారు.
అలానే అల్లు అరవింద్ గురించి చెబుతూ.. ఇండస్ట్రీలో కష్టపడితేనే నిలబడగలం. ప్రతి ఒక్కరూ మెగాస్టార్ బావమరిదిలా, స్టార్ కమెడియన్ కొడుకులా, ఐకాన్ స్టార్ తండ్రిలా పుట్టలేరు. కొందరికే ఆ అదృష్టం దక్కుతుంది, కానీ మనలాంటి వారు కష్టపడినా క్రెడిట్ చివర్లో వాళ్లకే వెళ్లిపోతుందని వ్యాఖ్యానించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications