భర్త కోసం అమ్మాయిని సెట్ చేసే భార్య..అరాచకం భయ్యా..!

ఇటీవల కాలంలో ఓటీటీలో చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా వెబ్ సిరీస్‌లు , చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. కంటెంట్ బాగుంటే చాలు తెలుగు ప్రేక్షకులు పరభాష సినిమాలను సైతం నెత్తిన పెట్టుకుంటారనే విషయం తెలిసిందే. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ సైతం ఇతర భాషల్లో హిట్ సినిమాలను తెలుగు భాషలో డబ్ చేస్తూ ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాగా ఓటీటీలో ఓ రొమాంటిక్ సినిమా అదరగొడుతుంది. ఈ సినిమానే 'బసంత్ ఎసే గెచే'. ఈ బెంగాలీ వెబ్ సిరీస్ 2024లో విడుదలై, ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంది.

ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.ఈ వెబ్ సిరీస్‌కు అభిమన్యు ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌లో స్వస్తికా దత్తా, అర్పణ్ ఘోషల్ , డోనా సాహా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఒక పట్టణ నేపథ్యంలో సాగుతుంది. వర్షం కురుస్తున్న నగరంలో, కొందరు యువత తమ జీవితాల్లో ఎదురయ్యే ప్రేమ, స్నేహం ఇతర సంబంధాల చుట్టూ తిరుగుతుంది ఈ కథ. ముఖ్యంగా "బాంగ్" సంస్కృతిని మరియు నేటి తరం యువత ఆలోచనలను సరళమైన మరియు హాస్యభరితమైన రీతిలో చూపించే ప్రయత్నం చేశారు.

ఇంజినీరింగ్ విద్యార్థినిగా ఉండే తియాషా, తన లెక్కల టీచర్ నిషాన్‌ మీద ప్రేమలో పడుతుంది. తన ప్రేమను లవ్ లెటర్ రూపంలో వ్యక్తం చేస్తుంది. కానీ నిషాన్‌కు ఇప్పటికే భార్య ఉండటంతో అతను ఆ లేఖను పట్టించుకోడు. పైగా తన భార్య చంద్రిమాకు చూపిస్తాడు. ఆ తరువాత చంద్రిమా, ఈ ఎంటైర్ లవ్ డ్రామాను ఒక ఆటగా తీసుకుంటూ, తియాషాతో చాటింగ్ చేస్తుంది.అలా భర్తకు అమ్మాయిని సెట్ చేయడం చూట్టు కథ తిరుగుతుంది. ఒక టీచర్-స్టూడెంట్ మధ్య ప్రేమ అనే స్పర్శకు కొత్త కోణాన్ని ఇచ్చిన ఈ సినిమా, భావోద్వేగాలకు దారితీసే కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కొత్త కథలకు ఆసక్తి ఉన్నవారు ఈ సినిమాను తప్పకుండా ఓసారి చూడవచ్చు. ఈ వెబ్ సిరీస్ Adda times అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+