హత్య కేసులో మరో నటుడు అరెస్టు, హీరో, నటుడు గర్ల్ ఫ్రెండ్ తో లింక్, స్క్పార్పియో కారులో ??
కన్నడ సినీ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ప్రమేయంతో కర్ణాటకలోని చిత్రదుర్గ నివాసి రేణుకాస్వామి హత్య జరిగిందని ఆరోపణలు రావడంతో హీరో దర్శన్ తో పాటు ఆయన ప్రియురాలు, నటి పవిత్రా గౌడతో సహ మొత్తం 13 మంది అరెస్టు అయ్యి జైలుకు వెళ్లారు. అయితే రేణుకాస్వామి హత్య కేసు రోజురోజుకూ ట్విస్ట్‌గా మారుతోంది. ఇదే హత్య కేసులో మరో కన్నడ సినీ నటుడు అరెస్టు అయ్యాడు.
దీంతో నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడతో సహా ఈ కేసులో అరెస్ట అయిన నిందితుల సంఖ్య 14కి చేరింది. ప్రస్తుతం అరెస్టు అయిన కన్నడ నటుడి పేరు ప్రదోష్. ఈ హత్య కేసులో 14వ నిందితుడిగా ఉన్న ప్రదోష్ కన్నడ సినిమాల్లో నటించాడు. హీరో దర్శన్ తో కలిసి బృందావన, బుల్ బుల్ చిత్రాల్లో ప్రదోష్ నటించాడని, మరి కొన్ని కన్నడ సినిమాల్లో అతను నటించాడని పోలీసు అధికారులు అంటున్నారు.

కన్నడ హీరో దర్శన్ సన్నిహితుల్లో నటుడు ప్రదోష్ మంచి గుర్తింపు పొందాడని పోలీసు అధికారులు అంటున్నారు. కన్నడ నటుడు ప్రదోష్ కర్ణాటకకు చెందిన ఓ సీనియర్ బీజేపీ నేతతో సన్నిహితంగా కూడా పనిచేసినట్లు సమాచారం ఉందని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఓ హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్ కావడం ఇప్పటికే కర్ణాటకలో కలకలం రేపుతోంది. ఇదే సమయంలో ఇదే హత్య కేసులో మరో కన్నడ నటుడు అరెస్టు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
రేణుకాస్వామి హత్యకేసులో కన్నడ నటుడు ప్రదోష్ పాత్ర కీలకమని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు చెబుతున్నారు. రేణుకాస్వామిని హత్య చేసిన తరువాత హీరో దర్శన్ ఆదేశాల మేరకు ప్రదోష్ తదితరులు రేణుకాస్వామి మృతదేహాన్ని స్కార్పియో కారులో తీసుకెళ్లి బెంగళూరు నగరంలోని సుమ్మనహళ్లిలోని ఓ అపార్ట్‌మెంట్ ముందున్న కల్వర్టులో పడేశారని పోలీసులు అంటున్నారు.
రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, నటి పవిత్రా గౌడతో సహ ఇప్పటికే 14 మంది అరెస్టు అయ్యారు. అయితే ఇదే కేసులో మరో నలుగురు తప్పించుకున్నారని, వారి కోసం గాలిస్తున్నామని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు. రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్టు కావడం ఇప్పటికే దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు మరో నటుడు కూడా అరెస్టు కావడంతో ఈ హత్య కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో అని కన్నడిగులు అంటున్నారు.












Click it and Unblock the Notifications