మేడమ్ మీ నడుము చాలా బాగుంది
సోషల్ మీడియా వచ్చిన తరువాత ప్రపంచమే మన చేతిలో ఉన్నట్లుగా ఉంది పరిస్థితి. ఎక్కడ ఏం జరిగిన కూడా క్షణంలోనే సోషల్ మీడియా ద్వారా ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. అయితే సోషల్ మీడియా వల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కడ నుంచి అయిన ఎవరి పైనైనా విమర్శలు చేయవచ్చు. ముఖ్యంగా సెలబ్రిటీలు అయితే సోషల్ మీడియా ద్వారా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అభిమానులకు, సినీ తారలకు మధ్య దూరం తగ్గిపోయింది. నేరుగా తమ అభిమాన సినీ తారలతో మాట్లాడే అవకాశం సోషల్ మీడియా కల్పిస్తోంది.
దీంతో సెలబ్రిటీలను తమకు నచ్చిన ప్రశ్నలు అడిగేస్తున్నారు.సరిగ్గా ఇలాంటి పరిస్థితే హీరోయిన్ అనన్య నాగళ్లకు ఎదురైంది. మల్లేశం సినిమాతో అనన్య నాగళ్ల తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత ప్లే బ్యాక్ (2021), వకీల్ సాబ్ (2021) సినిమాల్లో నటించింది. 2019లో సైమా ఉత్తమ మహిళా నటిగా ఎంపికైంది.ఆమె షాదీ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించినందుకు గాను ఉత్తమ నటిగా సైమా అవార్డు అందుకుంది.ఈ ఏడేది పొట్టేల్, తంత్ర వంటి సినిమాలతో సందడి చేసింది.అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా విశేషాలను, లేటెస్ట్ ఫొటో షూట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

తాజాగా ఈ భామ ఓ ఇంటర్వ్యూలో మాట్లడుతున్న సమయంలో ఇప్పటి వరకు మీకు వచ్చిన బెస్ట్ కంప్లిమేంట్ ఏంటని యాంకర్ ప్రశ్నించారు. దీనికి కంప్లిమేంట్ అనన్య నాగళ్ల సమాధానం ఇస్తూ..కెరీర్ ప్రారంభంలో ఓ షాప్ ఓపెనింగ్ వెళ్లాలనని, ఆ సమయంలో ఓ అభిమాని తన వద్దకు వచ్చిమేడమ్ మీ నడుము చాలా బాగుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడని..అదే నాకు ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ కంప్లిమేంట్ అని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. అయితే ఆ కామెంట్ వల్ల తనకు కోపం రాలేదని, పైగా నచ్చిందని అనన్య తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications