'భగవంత్ కేసరి'ని పైకెత్తిన లియో, టైగర్..!!

తెలుగు సినిమాలకు సంబంధించి సంక్రాంతి అతి పెద్ద సీజన్. దాని తర్వాత పెద్ద సీజన్ దసరా పండగ. సినిమాలు ఎక్కువగా విడుదలయ్యేది సంక్రాంతి తర్వాత దసరా పండగకే. ఈ దసరాకు మూడు సినిమాలు వచ్చాయి. నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి, విజయ్ లియో, రవితేజ మొదటి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ మూడు సినిమాల్లో భగవంత్ కేసరి పాజిటివ్ టాక్ తెచ్చుకోగా, లియో, టైగర్ నాగేశ్వరరావు నెగెటివ్ టాక్ ను మూటగట్టుకున్నాయి.

విడుదలైన మొదటిరోజు రెండో ఆట నుంచే ఈ రెండు సినిమాలకు నెగెటివ్ టాక్ రావడంతో అందరూ భగవంత్ కేసరిపై దృష్టిసారించారు. వీకెండ్ కలెక్షన్లు ఈ సినిమా కొల్లగొట్టే అవకాశం కనపడుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో భగవంత్ కేసరికంటే ముందున్న లియో ఆఫ్ లైన్ లో కూడా టికెట్లు తెగడం కష్టంగా మారింది. విడుదలకు ముందు ఈ మూడు సినిమాలు కచ్చితంగా హిట్ అవుతాయని అందరూ భావించారు. లియో చూసినవారంతా పెదవి విరుస్తుండటంతో రెండో రోజు కలెక్షన్లు బాగా డ్రాప్ అయ్యాయి. టైగర్ సంగతి సరేసరి.

bhagavanth kesari is the dussehra winner in telugu film industry

టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో సినిమా సీరియస్ గా సాగడంతోపాటు వయొలెన్స్ ఎక్కువ కావడంతోపాటు సినిమా నిడివి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేదిలా మారింది. వాస్తవానికి ఈ సినిమాలో కొన్ని ఆకర్షణలున్నప్పటికీ నెగెటివ్ టాక్ స్ప్రెడ్ కావడంతో నిలదొక్కుకోవడం కష్టంగానే మారింది. సరిగ్గా అదే సమయంలో బాలయ్య సినిమా భగవంత్ కేసరి కుటుంబ ప్రేక్షకులు చూసేలా, మహిళలు చూసేలా రూపుదిద్దుకోవడంతో దసరా విన్నర్ గా నిలిచింది. తొలిరోజు రూ.33 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+