Bigg Boss 9 : మెగా ఫ్యామిలీ సపోర్టు ఆ కంటెస్టెంట్‌కే.. టైటిల్ కొట్టడం డౌటే..!
ఎప్పటినుంచో ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్ తెలుగు 9వ సీజన్ ఆదివారం రాత్రి గ్రాండ్‌గా మొదలైంది. ఈసారి షోలో కొత్తదనం ఉంటుందని, చదరంగం కాదని, రణరంగమేనని నాగార్జున స్పష్టం చేయడంతో, ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సీజన్ కంటెస్టెంట్లలో ఒకరు, ప్రముఖ టీవీ నటుడు భరణి శంకర్.
చిలసౌ స్రవంతి, సీతామహాలక్ష్మి, కుంకుమ రేఖ వంటి సీరియల్స్‌తో పాటు, బాహుబలి, పరమ వీర చక్ర వంటి చిత్రాల్లో నటించిన భరణి శంకర్ సుమారు 30కి పైగా సీరియల్స్‌లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన భరణి శంకర్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు తన ఇన్‌స్టాగ్రామ్‌లో శుభాకాంక్షలు తెలిపారు.

నాగబాబు పోస్ట్ చేస్తూ, "నాకు అత్యంత సన్నిహితుడైన భరణి శంకర్ బిగ్‌బాస్ 9 సీజన్‌లోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకు నా శుభాకాంక్షలు. ఈ ప్రయాణం అతడికి విజయాన్ని, మంచి గుర్తింపుని తీసుకురావాలని కోరుకుంటున్నాను" అని పేర్కొన్నారు.
అయితే, నాగబాబు పోస్ట్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. భరణి శంకర్‌కు శుభాకాంక్షలు చెప్పడం ద్వారా నాగబాబు జన సైనికులకు హింట్ ఇచ్చారని, భరణి శంకర్‌కు ఓట్లు వేసి గెలిపించాలని ఇన్డైరెక్ట్‌గా సూచించారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లకు టాస్కులు ఇస్తే, భరణి శంకర్‌ని గెలిపించడం జన సైనికులకు నాగబాబు ఇచ్చిన టాస్క్ అని వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు.
ఈ సారి బిగ్‌బాస్ సీజన్‌లో తనుజ, ఆశాషైనీ, సంజనా గల్రానీ, రీతూ చౌదరి, శ్రేష్ఠ వర్మ, ఇమ్మానుయేల్, రాము రాథోడ్, సుమన్ శెట్టి వంటి సెలబ్రిటీ కంటెస్టెంట్లతో పాటు, మాస్క్ మెన్ హరీష్, శ్రీజ దమ్ము, మర్యాద మనీష్, జవాన్ పవన్ కల్యాణ్, ప్రియా శెట్టి 'అగ్ని పరీక్ష' కంటెస్టెంట్లుగా హౌస్‌లోకి ప్రవేశించారు.
ఈ నేపథ్యంలో, బిగ్‌బాస్ హౌస్‌లో భరణి శంకర్ ప్రయాణం ఎలా ఉండబోతుంది, జన సైనికుల మద్దతు అతనికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది చూడాలి.












Click it and Unblock the Notifications