ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ..?
టాలీవుడ్ స్టార్ హీరో, మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. స్టార్ డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల అయింది. ఈ చిత్రంలో అందాల భామలు డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గానే మిగిలింది.
ఇక సంక్రాంతి రేసులోకి వచ్చిన పెద్ద సినిమాల్లో ఓటీటీ విడుదల తేదీని ఖరారు చేసుకున్న మొదటి చిత్రంగా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమా నిలిచింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. కానీ పలు కారణాల వల్ల ఈ మూవీ స్ట్రీమింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ సినిమా రిలీజై 59 రోజులు కావొస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ మూవీ ఓటీటీ విడుదలకు మోక్షం లభించినట్లు తెలుస్తోంది. ఈ నెల 13 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా థియేటర్లో విడుదలైన చిత్రాలు దాదాపు 4 నుంచి 6 వారాల్లో ఓటీటీలోకి వస్తాయి. అయితే 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' విషయంలో స్ట్రీమింగ్ కాకపోవడం గమనార్హం.

కొన్ని రోజుల ముందే ఈ సినిమా స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా వేశారు. అనేన సార్లు ఓటీటీ స్ట్రీమింగ్ వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ అయింది. అయితే ఈ విషయంపై చిత్ర బృందం లేదా ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి ఇప్పటివకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి ఈ సారైనా ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తుందో లేదో.. లేకుంటే మరోసారి వాయిదా వేస్తారో కొన్ని రోజుల్లో తెలుస్తుంది. అయితే ఈ మూవీ కేవలం ఒక్క తెలుగులో మాత్రమే కాదు. హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. సంక్రాంతి పండగ తర్వాత దాదాపు 2 నెలల గ్యాప్ తో ఈ సినిమా ఓటీటీలోకి వస్తున్న నేపథ్యంలో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
-
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
'కాంతార' టీమ్‌తో రిషబ్ శెట్టికి గొడవలు? రుక్మిణి వసంత్‌కు ఊహించని షాక్! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications