Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నీ బాడీలో అన్నీ "పెద్దగానే" ఉన్నాయ్.. లేడీ ఫ్యాన్‌తో స్టార్ యాక్టర్ కామెంట్స్ !

హద్దు దాటితే ఎవరికైనా తిప్పలు తప్పవు. అది సామాన్య ప్రజలు అయినా.. సినీ ప్రముఖులు అయినా కానీ ఎవరైనా సరే అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదు. సినిమా కార్యక్రమాలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూ లలో మాట్లాడుతూ నటీనటులు ఓవర్ గా కామెంట్స్ చేస్తున్న ఘటనలు ఇటీవల చోటు చేసుకుంటున్నాయి. ఆ తర్వాత సైలెంట్ గా సారీ చెప్పేయడం పరిపాటిగా మారింది. ఈ తరహా ఘటనలు ఇటీవల టాలీవుడ్ లో ఎక్కువగా జరగడం చూశాం.

కాగా కొద్ది రోజుల క్రితమే భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో 'పవర్ స్టార్'గా గుర్తింపు తెచ్చుకున్న పవన్ సింగ్ ఇటీవల ఒక వేదికపై హీరోయిన్ అంజలి నడుమును తాకడం తీవ్ర వివాదానికి దారితీసింది. పబ్లిక్ గానే అంజలి నడుమును పదే పదే టచ్ చేశాడు.

bhojpuri-star-actor-khesari-lal-yadav-comments-on-lady-fan-goes-viral

ఇష్యూ పెద్దది కావడంతో దెబ్బకు ఆయన క్షమాపణలు కూడా చెప్పాడు. అలానే హీరోయిన్ అంజలి సైతం సోషల్ మీడియాలో సంచలన వీడియో పోస్ట్ చేసింది. మొదట అది పొరపాటుగా జరిగిందని, బ్లౌజ్ ట్యాగ్ ఏమైనా బయటికి వచ్చిందేమోనని తాను భావించానని చెప్పింది. కానీ తర్వాత అది ఉద్దేశపూర్వకంగా జరిగిందని తెలుసుకొని షాక్‌కు గురయ్యానని పేర్కొంది.

సదరు హీరో ప్రవర్తన వల్ల తాను తీవ్ర ఇబ్బంది పడ్డానని ఆవేదన వ్యక్తం చేసింది. ఏ అమ్మాయినైనా అసభ్యంగా తాకడం తప్పు అని.. తమ ప్రాంతంలో ఇలా చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేసింది. ఇక నుంచి భోజ్ పురి సినిమాల్లో నటించనని తెలిపింది. అయితే ఈ ఘటనను మర్చిపోక ముందే ఇప్పుడు మరో భోజ్‌పురి స్టార్ యాక్టర్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో వార్తల్లో నిలిచాడు.

నీ బాడీలో అన్నీ "పెద్దగానే" ఉన్నాయ్ అంటూ లేడీ ఫ్యాన్ తో షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంతే కాకుండా ఆమెను హాగ్ చేసుకుంటూ విచిత్రమైన ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

bhojpuri-star-actor-khesari-lal-yadav-comments-on-lady-fan-goes-viral

ఏం జరిగిందంటే..?

ప్రముఖ భోజ్ పురి నటుడు ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టేజిపై మాట్లాడుతూ ఓ మహిళా అభిమానిని పిలిచాడు. ఆమె పైకి వచ్చాక.. నువ్వు పెద్దామెవా, చిన్నామెవా అని అడిగారు. చిన్నామెనే అంటూ సదరు యువతి బదులిచ్చింది. అందుకు ఆ నటుడు.. నీ బాడీలో ఏదీ చిన్నగా లేదంటూ చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. ఆ అభిమాని సైతం ఒకింత షాక్ కు గురవ్వగా.. వెంటనే ఆ యాక్టర్ కవర్ చేస్తూ.. ఆమె హైట్ చూడండి, ఆమె జుట్టు చూడండి ఏదీ చిన్నగా లేదంటూ చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత ఆ యువతిని హాగ్ చేసుకుంటూ ఓ రకమైన ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చారు. దాంతో నెటిజన్లు ఆ నటుడుపై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మహిళా అభిమానితో ఇలా ప్రవర్తిస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారడంతో.. ఆ నటుడు ఎలా రియాక్ట్ అవుతారో అని చర్చ నడుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+