హీరోయిన్‌ అంజలిని తాకరాని చోట తాకిన 'పవర్ స్టార్'

భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో 'పవర్ స్టార్'గా పేరుగాంచిన నటుడు పవన్ సింగ్ ఇటీవల ఒక వేదికపై హీరోయిన్ అంజలి నడుమును తాకడం తీవ్ర వివాదానికి దారితీసింది. దీనిపై రెండు రోజులుగా మౌనంగా ఉన్న అంజలి, తాజాగా ఒక సంచలన వీడియోను విడుదల చేసి తన ఆవేదనను వ్యక్తపరిచింది.

లక్నోలో జరిగిన ఈవెంట్‌లో పవన్ సింగ్ తనను అసభ్యంగా తాకిన విషయాన్ని ఆమె వివరించింది. మొదట అది పొరపాటుగా జరిగిందని, బ్లౌజ్ ట్యాగ్ ఏమైనా బయటికి వచ్చిందేమోనని తాను భావించానని చెప్పింది. కానీ, తర్వాత అది ఉద్దేశపూర్వకంగా జరిగిందని తెలుసుకొని షాక్‌కు గురయ్యానని పేర్కొంది. ''ఎవరైనా మన అనుమతి లేకుండా మన శరీరాన్ని తాకితే అది సంతోషంగా ఉంటుందా? నాకు చాలా కోపం, బాధ కలిగింది'' అంటూ తన మనసులోని ఆవేదనను పంచుకుంది.

Bhojpuri Star Pawan Singh s Alleged Misconduct Actress Anjali Breaks Silence Reveals Shocking Details

ఈ ఘటనపై ఎందుకు వెంటనే స్పందించలేదని అడిగిన వారికి ఆమె సమాధానమిస్తూ, ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది వ్యక్తులు పవన్ సింగ్ పలుకుబడి గురించి బెదిరించారని, ఇలాంటివి సహజమేనని చెప్పడంతో తాను సైలెంట్‌గా ఉండాల్సి వచ్చిందని తెలిపింది. కానీ ఇప్పుడు, ఈ సంఘటన ఇంతింతై ఇంత పెద్దదిగా మారుతుందని అనుకోలేదని చెప్పింది.

తన వీడియో ద్వారా, ఏ అమ్మాయినైనా అసభ్యంగా తాకడం తప్పు అని, తన ప్రాంతంలో ఇలా చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని అంజలి స్పష్టం చేసింది. ఈ చేదు అనుభవం తర్వాత భోజ్‌పురి సినిమాల్లో నటించాలనే కోరిక కూడా తనకు పోయిందని బాధపడింది. ప్రస్తుతం నెటిజన్లు అంజలికి మద్దతుగా నిలుస్తూ ఆమెకు ధైర్యం చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+