బ్లాక్ డ్రెస్‌లో బేబీ బంప్ ఫోటో షూట్ చేసిన భూమా మౌనిక..వైరల్ ఫిక్స్...
నటుడు మంచు మనోజ్ భూమా మౌనికను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, అలాగే మంచు మనోజ్ గుడ్ న్యూస్ చెప్పిన విషయం కూడా విదితమే. తన భార్య భూమా మౌనిక గర్భం దాల్చిందని, త్వరలో తాను తండ్రిని కాబోతున్నానని గత డిసెంబర్‌లో తెలిపాడు మంచు మనోజ్. ఈ విషయంలో తన కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉన్నట్టు తెలిపాడు మంచు మనోజ్. అయితే, తాజాగా భూమా మౌనిక సోషల్‌మీడియాలోని తన ఖాతాలో తన బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్‌లో బేబీ బంప్ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలను కాస్త ఇన్‌స్టాలో పెట్టేసింది. అవి కాస్త ఇప్పడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే, భూమా మౌనిక తన బేబీ బంప్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. నా జీవితం, నా పక్కన ఉండే వాళ్ళతో ఎప్పుడూ నన్ను ఆకర్షిస్తుంది. నన్ను మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడేలా చేస్తుంది అంటూ మంచు మనోజ్‌ని, తన మొదటి కొడుకు ధైరవ్ ని ట్యాగ్ చేసింది. ఈ పోస్ట్‌కి మంచు మనోజ్ సరదాగా కామెంట్ చేశాడు. పిల్లా ఓ పిల్లా నువ్వంటే నాకు ప్రాణమే కామెంట్ పెట్టాడు. భూమా మౌనిక బేబీ బంప్ ఫోటోలు కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

భూమా మౌనిక, మంచు మనోజ్ వీరిద్దరూ కలిసి గత డేదాడి ఓ బిజినెస్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. గతేడాది క్రిస్మస్ సందర్భంగా తమ కొత్త బిజినెస్ గురించి వీరిద్దరూ వివరించారు. నమస్తే వరల్డ్ అనే బొమ్మల షాపును ప్రారంభించారు మనోజ్,మౌనిక. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్‌లో నమస్తే వరల్డ్ పేరిట ఈ బొమ్మల షాప్‌ను ప్రారంభించారు. ఈ బొమ్మలన్నీ ఇండియాలో తయారు చేసినవేనని వివరించారు. దేశం నలుమూలలా తిరిగి ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో ముడిసరుకు తీసుకువచ్చి ఈ బొమ్మలను తయారుచేసినట్లు తెలిపారు. ఇది పూర్తిగా మేడిన్ ఇండియా అని వివరించారు మంచుమనోజ్.












Click it and Unblock the Notifications