కల్కి సినిమాపై తన మనసులోని మాటను బయటపెట్టిన బిగ్‌బీ...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం రికార్డులు వర్షం కురిపిస్తోంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక, ఈ సినిమా విడుదలయిన అతి కొద్దిరోజుల్లోనే రూ. 1000 కోట్ల కలెక్షన్ల వైపు అడుగులు పెడుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై చాలామంది చాలారకాలుగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే, తాజాగా ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించిన బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్ కూడా ఈ మూవీపై తన మనసులోని మాటను బయటపెట్టారు. ఇంతకీ అదేంటో చూసేద్దామా..?
ఈ చిత్రం సక్సెస్ మీట్ సందర్శంగా దర్శకుడు నాగ్ అశ్విన్, బిగ్‌బి కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. తాజాగా ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఇందులో అమితాబ్ చేసిన వ్యాఖ్యలు కల్కి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. బిగ్‌బి మాట్లాడిన మాటలు.. తనకు హైదరాబాద్‌లో తెలుగు ప్రేక్షకుల మధ్య కూర్చొని ఈ సినిమా చూడాలని ఉందని, ఎందుకంటే ఈ చిత్రాన్ని చూసి వాళ్లు ఫిదా అయిపోయి ఉంటారని బిగ్ బీ తన మనసులోని కోరికను ఇలా బయటపెట్టారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ ప్రోమో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే, ఈ పూర్తి వీడియో త్వరలోనే రానుంది. ఈ ఇంటర్వ్యూలో భాగంగానే సినిమాలోని పలు అంశాలపై వారు మాట్లాడారు. దీపికా పాత్ర గురించి నాగ్ అశ్విన్ అడిగిన బిగ్‌బి.. నువ్వు దీపికా పదుకొణె పాత్ర గురించి ఎలా ఆలోచించావు, ఆ ఆలోచన నీకు ఎలా వచ్చింది" అని సుమతి పాత్రను ఉద్దేశించి అడిగారు అమితాబ్. దీపికా పదుకొనె నిప్పుల్లో నడుచుకుంటూ వెళ్లే సన్నివేశాన్ని గుర్తుచేసుకున్నారు.
ప్రభాస్‌ను డామినేట్ చేసే సీన్స్..
కల్కి చిత్రంలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్ అశ్వాద్ధామా రోల్‌ను ప్లే చేశారు. ఆయన నటనకు చాలామంది అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇక ఇందులో బిగ్‌బీ యాక్టింగ్ గురించి ఇప్పటికే చాలామంది ఆయనపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. కల్కి సినిమాలో అమితాబ్‌బచ్చన్‌కు దొరికిన స్క్రీన్ స్పేస్, ఎలివేషన్లు మరే ఇతర యాక్టర్స్‌కు దక్కలేదనే చెప్పాలి. సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో అయితే ప్రభాస్‌నే డామినేట్ చేసే స్థాయిలో ఎలివేషన్లు ఉన్నాయి.












Click it and Unblock the Notifications