Bigg Boss 9 : బిగ్ బాస్ రెండో వారంలో ఎలిమినేషన్ అతడే.. రెండు వారాలకు భారీగా రెమ్యూనరేషన్
బిగ్ బాస్ సీజన్ 9 రోజురోజుకూ ఊహించని మలుపులతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. అగ్నిపరీక్ష ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టి, మొదట్లోనే సంచలనం సృష్టించిన కామనర్ల నుంచి ఈసారి ఎలిమినేషన్ జరిగింది. హౌస్‌లో తనదైన శైలితో ఆకట్టుకున్న మర్యాద మనీష్ ఈ వారం బిగ్‌బాస్ ఇంటి నుంచి నిష్క్రమించాడు.
నిజానికి, మనీష్ హౌస్‌లో తన వంద శాతం కష్టాన్ని చూపించాడు. ప్రతి టాస్కులోనూ చురుగ్గా పాల్గొంటూ, గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే, కొత్తగా ఏదైనా చేయాలనే అతని ప్రయత్నాలు కొన్నిసార్లు వికటించాయి. ముఖ్యంగా, ఈ వారం భరణిని టార్గెట్ చేయడం, ఒక సీఐడీ ఆఫీసర్ లాగా వ్యవహరిస్తూ చిన్న విషయాలను పెద్దవిగా మార్చడం ప్రేక్షకులకు నచ్చలేదు. అందుకే ఓట్ల పరంగా అతను వెనుకబడ్డాడు.

మనీష్‌తో పాటు ఫ్లోరా కూడా ఎలిమినేషన్‌లో నిలిచింది. ఫ్లోరాకు అధికంగా ఓట్లు రావడంతో మనీష్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. నీష్‌కు మొదట్లోనూ తక్కువ ఓటింగ్ లభించినప్పటికీ, శ్రీముఖి అతనిని హౌస్‌లోకి పంపడంతో మరో అవకాశం దక్కింది. అతను హౌస్‌లో ఉండే అర్హత ఉన్నప్పటికీ, బలమైన అభిమాన గణం లేకపోవడం వల్లే ఎలిమినేషన్ ఎదుర్కోవాల్సి వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
వృత్తిపరంగా మంచి స్థితిలో ఉన్న మనీష్‌కు బిగ్‌బాస్ టీమ్ భారీగానే రెమ్యూనరేషన్ అందించినట్లు సమాచారం. రెండు వారాలకు గాను అతనికి వారానికి ₹70,000 చొప్పున మొత్తం ₹1.40 లక్షలు చెల్లించారని తెలుస్తోంది. గతంలో 'ఎవరు మీలో కోటీశ్వరుడు' షోలో కూడా పాల్గొన్న మనీష్, బిగ్‌బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ పాపులారిటీని ఉపయోగించుకుని తన భవిష్యత్తు కెరీర్‌ను ఎలా మలుచుకుంటారో చూడాలి.












Click it and Unblock the Notifications