బిగ్‌బాస్‌లో ఫైటింగ్..కొట్టుకున్న కంటెస్టెంట్లు (వీడియో)
సంచలనాలకు మారు పేరుగా నిలుస్తోంది బిగ్ బాస్ షో . కొంతమంది సెలబ్రిటీలను ఒక హౌస్‌లో 100 రోజుల పాటు ఉంచి వారితో రకరకాల ఆటలు ఆడిస్తూ..వారిలోని ఎమోషన్స్‌ను బయటకు తీసుకురావడమే ఈ షో యొక్క ముఖ్యం ఉద్దేశం. తొలుత హిందీలో మొదలైన ఈ రియాల్టీ షో తరువాత తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో కూడా ప్రారంభం అయింది.
షో మొదట్లో సెలబ్రిటీలను మాత్రమే తీసుకురాగా తర్వాత సామాన్యులను, పెళ్లైనా జంటలను కూడా షోకు తీసుకురావడం మొదలుపెట్టారు. సాధారణంగా బిగ్ బాస్ అనగానే గొడవలు,అరుచుకోవడాలు కామన్‌గా ఉంటాయి. అయితే కంటెస్టెంట్లు తమ హద్దులు దాటి ప్రవర్తించారు. ఏకంగా హౌస్‌లో అందరూ చూస్తుండగానే తన్నుకున్నారు.

ఇక్కడ అదృష్టం ఏమిటంటే..ఇది తెలుగు బిగ్ బాస్‌లో కాకపోవడం. ఈ సంఘటన తమిళ బిగ్ బాస్‌లో చోటు చేసుకుంది. బిగ్ బాస్ తమిళ సీజన్ 9 ఐదో వారంలోకి అడుగుపెట్టడంతోనే ఊహించని మలుపు తీసుకుంది. తాజా ఓపెన్ నామినేషన్స్ ప్రక్రియ తర్వాత హౌస్‌లో వాతావరణం వేడెక్కింది. నామినేట్ అయిన 12 మందిలో ఉన్న కమ్రుద్దీన్, ప్రవీణ్ మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం తారస్థాయికి చేరింది.
#Day30 #Promo1 of #BiggBossTamil
— Vijay Television (@vijaytelevision) November 4, 2025
Bigg Boss Tamil Season 9 - இன்று இரவு 9:30 மணிக்கு நம்ம விஜய் டிவில.. #BiggBossTamilSeason9 #OnnumePuriyala #BiggBossSeason9Tamil #BiggBoss9 #BiggBossSeason9 #VijaySethupathi #BiggBossTamil #BB9 #BiggBossSeason9 #VijayTV #VijayTelevision pic.twitter.com/jrFCHSPK8j
మొదట ప్రవీణ్‌తో మొదలైన గొడవ, జోక్యం చేసుకున్న ప్రజిన్ వైపు మళ్లింది. కమ్రుద్దీన్, ప్రజిన్ మధ్య పరిస్థితి చేతులు చేసుకోవడం వరకు వెళ్లింది. ఇద్దరు పోటీదారులు ఒకరినొకరు నెట్టుకోవడంతో హౌస్‌మేట్స్ భయంతో కేకలు వేశారు. ఈ ప్రోమో వీడియోలో అమ్మాయిలు ఏడవడం, ఇతరులు వారిని ఆపేందుకు ప్రయత్నించడం చూస్తుంటే, సీజన్ 9 చరిత్రలోనే ఇది పెద్ద గొడవగా కనిపిస్తోంది.
ఈ సంఘటన షోపై ఉన్న ప్రతికూల సమీక్షలను మరింత పెంచే అవకాశం ఉంది. హౌస్‌మేట్స్ ఎవరికైనా గాయమైందా? ఈ గొడవకు బిగ్ బాస్ ఎలాంటి శిక్ష విధిస్తారు? అనేది తదుపరి ఎపిసోడ్‌లో తేలనుంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications