Bigg Boss 9 : బిగ్ బాస్ స్టేజ్ నుంచి తొలిరోజే వెనుతిరిగిన ఏకైక కంటస్టెంట్ అతనే..!
ప్రేక్షకులను ఉత్సాహపరుస్తున్న బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా ముందుకు సాగుతోంది. ఆరో కంటెస్టెంట్‌గా 'మాస్క్ మ్యాన్' హరీష్ హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత, ఏడో కంటెస్టెంట్‌గా సినిమా, సీరియల్ నటుడు భరణి ఎంట్రీ ఇచ్చారు.
ఈ సీజన్‌లో మొదటి నుంచే సెలబ్రిటీలు, సామాన్యుల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. తొలి ఎంట్రీగా నటి తనుజ తన స్టైల్‌తో ఆకట్టుకోగా, రెండో కంటెస్టెంట్‌గా ఆశాశైనీ గ్లామరస్ ఎంట్రీ ఇచ్చారు. మూడో ఎంట్రీగా సామాన్యుడు కళ్యాణ్ హౌస్‌లోకి అడుగుపెట్టారు.

నాల్గో ఎంట్రీగా హాస్యనటుడు ఇమ్మాన్యుయేల్ తన పంచ్‌లతో నవ్వులు పంచగా, ఐదో కంటెస్టెంట్‌గా డ్యాన్స్ మాస్టర్ శ్రేష్టి వర్మ తన డ్యాన్స్‌తో ఆకర్షించారు. ఆరో కంటెస్టెంట్‌గా 'మాస్క్ మ్యాన్' హరీష్ రాకతో సామాన్యుల బలం పెరిగింది. ఇప్పుడు ఏడో కంటెస్టెంట్‌గా వచ్చిన భరణి స్టేజ్ మీద నుంచే వెనుతిరిగారు. అతను తనతో వచ్చిన వస్తువును తీసుకు వెళ్లడానికి బిగ్ బాస్ అనుమతి ఇవ్వకపోవడంతో అతను షో మొదటి రోజునే వెనక్కి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications