ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ..బిగ్‌బాస్ నటికి వేధింపులు
ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక
సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు.
తాజాగా తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపులను బయట పెట్టింది బిగ్‌బాస్ నటి కీర్తి భట్. ఆ వివరాల్లోకి వెళ్తే...కీర్తి భట్ ప్రముఖ సీరియల్ నటిగా అందరికి సుపరిచితురాలే. మనసిచ్చి చూడు ,కార్తీక దీపం వంటి సీరియల్స్‌లో నటించి కీర్తి భట్ ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది.ఈ తరువాత తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టింది. తనదైన ఆట తీరుతో టాప్ 5 వరకు నిలిచింది. కీర్తి భట్ తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి వివరించింది.

కారు ప్రమాదంలో కీర్తి భట్ తన తల్లిదండ్రులతోపాటు అన్నయ్య, వదినలను కోల్పోయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత నన్ను మంగుళూరుకు తీసుకువెళ్లి అక్కడే 35 రోజులపాటు చికిత్స అందించారని తెలిపింది. అక్కడ నాకు చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఎక్కడెక్కడో టచ్ చేసేవారని తెలిసినప్పటికీ ..స్పర్శలేకపోవడం వల్ల నెట్టేయడానికి బలముండేది కాదు. కోలుకున్న తర్వాత అక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా వచ్చేశాను. ఎక్కడకైనా వెళ్లాలంటే డబ్బులు కావాలి. ఆటో వాళ్ల దగ్గరకి వెళ్తే 200 ఇస్తా వస్తావా అంటే సరే వస్తానని అనేదాన్ని. ఆ తర్వాత వాళ్ల లుక్స్ చూసి అర్థమయ్యేది అంటూ తన బాధను చెప్పుకుంది.కీర్తి భట్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications