నీ బాడీలో ఆ పార్ట్ సూపర్ అన్న నెటిజన్.. మీ అమ్మకు ఇలా చెబితే ఓకేనా అంటూ నటి రిప్లై

సోషల్ మీడియా వచ్చిన తరువాత ప్రపంచమే మన చేతిలో ఉన్నట్టుగా కొందరు ఫీల్ అవుతుంటారు. వేధింపులకు సోషల్ మీడియా ఓ వేదికగా మారుతుంది. సోషల్ మీడియా తప్పుదోవ పడుతుందనే చెప్పాలి. సోషల్ మీడియా ద్వారా ఎక్కడ నుంచైనా ఎవరి మీదనైనా కామెంట్ చేసే సౌలభ్యం కలగడంతో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. మహిళలకు లైంగిక వేధింపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక సెలబ్రిటీలకు సైతం ఈ వేధింపులు తప్పడం లేదు.తాజాగా ఓ బిగ్‌బాస్ నటికి నెటిజన్ ఆసభ్యకరమైన మెసేజ్ చేశాడు.

bigg boss actress swetha varma facing harassment

నటి శ్వేత వర్మ చేసింది తక్కువ సినిమాలే అయిన మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత రియాల్టీ షో బిగ్‌బాస్‌లో అడుగు పెట్టి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్వేత తన కెరీర్ విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ భామకు ఓ నెటిజన్ షాకిచ్చాడు. శ్వేత పుట్టిన రోజు కావడంతో అతను ఆమెకు విషెష్ పెట్టాడు. దీనికి శ్వేత సైతం రిప్లై ఇచ్చింది. ఆ తరువాత అతను పలుమార్లు శ్వేతకు మెసేజ్‌లు చేయడం జరిగింది. అయితే అతను హద్దులు దాటి మరీ శ్వేతకు మెసేజ్ చేశాడు. నీ వక్షోజాలు అదుర్స్ అంటూ శ్వేత వర్మకు కామెంట్ చేశాడు.దీనిపై ఆమె రేంజ్‌లో ఫైర్ అయింది.

bigg boss actress swetha varma facing harassment

అతని అమ్మకు కూడా ఎవరైనా ఇలాగే చెబితే పర్వాలేదు అనుకుంటాడా ? అంటూ రాసుకొచ్చింది. అలాగే అతడి వివరాలతో కూడిన స్క్రీన్ షాట్ కూడా షేర్ చేసింది. ఇలాంటి వాళ్లను చూస్తే సిగ్గేస్తుందని.. అలాగే తనకున్న సోర్స్ ద్వారా అడ్రస్, కాంటాక్ట్ కూడా సంపాదించానని తెలిపింది. అతడిది రియల్ అకౌంటా ? ఫేక్ అకౌంటా ? అని ఆలోచన అక్కర్లేదని.. అది ఏదైనా తెచ్చిపెట్టే సోర్స్ తనకుందని తెలిపింది.

అతడి అడ్రస్ కూడా పోస్ట్ చేయగలని.. కానీ మనిషిని కాబట్టి చేయలేదు అంటూ చెప్పుకొచ్చింది. అతడు ఒక గుణపాఠం నేర్చుకుంటే మంచిది .. ఇలాంటి పనులు మళ్లీ చేయకుండా ఉంటే మంచిదని చెప్పుకొచ్చింది. మరోసారి అతడి కామెంట్ పై రియాక్ట్ అవుతూ ఓ వీడియోను షేర్ చేసింది. శ్వేత వీడియోపై నెటిజన్స్ రియాక్ట్ అవుతూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+