నా ఫిజిక్ బాగుందని చెప్పి రవితేజ సినిమాలో అలా చేశారు - బిగ్‌బాస్ బ్యూటీ
నటి దివి వద్త్య అందరికి సుపరిచితురాలే. బిగ్‌బాస్ రియాల్టీ షోతో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. ముందు కొన్ని సినిమాల్లో సరైన గుర్తింపు దక్కలేదు. అయితే బిగ్‌బాస్ షోతో ఒక్కసారిగా ఫేమస్ అయింది. మహేష్ బాబు మహర్షి, చిరంజీవి గాడ్ ఫాదర్ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు దివి వద్త్య అంటే గుర్తు పట్టని సినీ అభిమాని ఉండరు.ఈ భామ ప్రస్తుతం ''లంబసింగి'' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దివి వద్త్య చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆ వివరాల్లోకి వెళ్తే.. తన కెరీర్‌లో ఎదురైన కొన్ని ఘటనలను అభిమానులతో పంచుకుంది. సినిమాల్లో అవకాశాలు కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగానని.. లావుగా ఉంటే సన్నగా అవ్వాలని, సన్నగా ఉంటే లావు అవ్వాలని.. ఇలా రకరకాల కండిషన్లు పెట్టారని దివి తెలిపింది. అయినప్పటికీ వాటిని తట్టుకుని తన శరీర ఆకృతిని మార్చుకున్నానని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. రవితేజ సినిమాలో లీడ్ క్యారెక్టర్‌కు దివిని ఎంపిక చేశారట. నీ హైట్, ఫిజిక్ సినిమాకు ఎసెట్ అవుతుందని చిత్ర దర్శకుడు దివికి చెప్పారట. తీరా చూస్తే అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేశారని దివి వాపోయింది.

ఐదు రోజుల్లో సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పిన నిర్మాతలు..రాత్రికి రాత్రి ఫోన్ చేసి "నిన్ను మార్చామంటూ" దివికి చావు కబురు చల్లగా చెప్పారట. ఈ బాధల్నీ భరించలేక ఇంటికెళ్లి షవర్ పెట్టుకొని నోరు మూసుకొని ఎన్నోసార్లు ఏడ్చానంటూ తెలిపింది. బిగ్‌బాస్ ఇచ్చిన పాపులారిటీతో దివి కొన్ని వీడియో సాంగ్స్, వెబ్ సిరీస్‌లో నటించింది .అయితే ఏవి కూడా అనుకున్న రేంజ్‌లో మాత్రం గుర్తింపు తీసుకురాలేదు. ఇప్పటికీ సరైనా బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది. మరి దివి వద్త్య కెరీర్‌కు ఎప్పుడు బ్రేక్ వస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications