Priyanka Jain: కష్టాల్లో బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్..!
బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ ప్రియాంక జైన్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. జానకి కలగనలేదు సీరియల్ తో తెలుగు ప్రజలకు దగ్గరైన ఆమె.. ఆ తర్వాత బిగ్ బాస్ కు వెళ్లారు. ఫైనల్ వరకు వెళ్లారు. చివరికి ఐదో స్థానంలో నిలిచారు. అయినప్పటికీ ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే ప్రియాంక జైన్ ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారు. ఇందుకు సంబంధించి ఆమె సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే తన జీవితం బాగుంటుందని అనుకున్నట్లు చెప్పారు.
కానీ.. బయటకు రాగానే తనకు షాకింగ్ విషయం తెలిసినట్లు చెప్పారు. తన అమ్మ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. తన తల్లికి నెలసరిలో ఎక్కువ రక్తం వస్తోందని అన్నారు. వరుసగా 15-20 రోజులు బ్లీడింగ్ అవుతోందని.. దీంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు వివరించారు. పరీక్షలు నిర్వహించగా.. తన అమ్మకు క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ లో ఉన్నట్లు తేలిందని ప్రియాంక తెలిపారు. తన తల్లికి తాను బిగ్ బాస్ లో ఉండగానే ఈ సమస్య వచ్చని చెప్పారు.

అమ్మ తన కోసం ఆస్పత్రికి వెళ్లలేదన్నారు. తనను సపోర్ట్ చేయాలని నిర్ణయించుకుని ఎటు వెళ్లలేదని తెలిపారు. తాను బిగ్ బాస్ కు వెళ్లకుండా ఉంటే మంచిగుండేదని చెప్పుకొచ్చారు. తన తల్లికి లాపొరోస్కోపిక్ సర్జరీ చేపించనున్నట్లు తెలిపారు.గర్భాశయాన్ని తీసేయడం వల్ల క్యాన్సర్ ఆగిపోయే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెప్పారని ప్రియాంక వివరించారు. తన తల్లికి రక్తం కూడా తక్కువ ఉండడంతో రక్తం ఎక్కిస్తున్నట్లు చెప్పారు.
అలాగే ఆమె తన తల్లికి ఆస్పత్రిలో ఉన్న వీడియో కూడా ప్రియాంక జైన్ తన యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. శరీరంలో ఏమైనా మార్పులు ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.












Click it and Unblock the Notifications