ఈ సాయంత్రమే..: అయ్యగారు గొడ్డలి పట్టుకొచ్చారు: కంటెస్టెంట్స్ వీళ్లే

బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 10 ప్రేక్షకులను పలకరించబోతోంది. కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ ప్రతిష్టాత్మక 10వ సీజన్ ఈ సాయంత్రం 7 గంటలకు లాంచ్ కాబోతోంది. మైల్‌స్టోన్ సీజన్ కావడంతో ఈ సారి డిఫరెంట్ గా దశావతారం థీమ్‌తో షోను మరింత ఉత్కంఠభరితంగా డిజైన్ చేశారు. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది.

ఎప్పట్లాగే వినోదం, గొడవలు, ఎమోషన్స్, ఊహించని ట్విస్టులతో నిండి ఉండే ఈ షోలోకి కంటెస్టెంట్ల ఎంపికను చాలా వైవిధ్యంగా నిర్వహించారు. విభిన్న రంగాలు, నేపథ్యాలకు చెందిన ప్రముఖులతో పాటు ఈసారి సోషల్ మీడియా స్టార్స్, సామాన్యులకు కూడా సమాన ప్రాధాన్యత కల్పించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Bigg Boss Telugu 10 Premiere Today at 7 PM with Nagarjuna Hosts Check the Full Contestants Lineup

బుల్లితెర ప్రేక్షకుల ఆదరణ పొందిన దేబ్జానీ మోదక్ బిగ్ బాస్ హౌస్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఎన్నెన్నో జన్మల బంధం, సత్యభామ వంటి సూపర్ హిట్ సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన ఈ బెంగాలీ బ్యూటీ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే కొండ, ప్రేమదేశం, డెవిల్, లైన్ మెన్ వంటి చిత్రాల్లో హీరోగా నటించిన యూత్ ఫుల్ నటుడు ఆదిత్ అరుణ్ కూడా ఈ సీజన్‌లో కంటెస్టెంట్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

ఈశ్వర్ సాయి కేసులో అనూహ్య పరిణామం: డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం
ఈశ్వర్ సాయి కేసులో అనూహ్య పరిణామం: డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం

జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఆటో రామ్ ప్రసాద్ తనదైన టైమింగ్ పంచ్‌లతో హౌస్‌లో నవ్వుల పూయించనున్నాడు. ప్రముఖ హాస్యనటుడు పొట్టి నరేష్ కూడా ఈ సీజన్‌లో భాగం అయ్యారు. సాహో, పుష్ప వంటి ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమాలలో ప్రాధాన్యత గల పాత్రలు పోషించిన నటుడు, కమెడియన్ టెంపర్ వంశీ కూడా హౌస్‌లో సందడి చేయబోతోన్నాడు. తెలుగు టీవీ రంగాన్ని శాసించిన గ్లామరస్ యాంకర్, మోడల్ వర్షిణి సౌందరరాజన్ ఈ సీజన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

చందమామ కథలు చిత్రంతో కెరీర్ ప్రారంభించిన వర్షిణి... శాకుంతలం, మళ్లీ మొదలైంది సినిమాల్లో నటించారు. వీరితో పాటు బిగ్ బాస్ నిర్వహించిన అగ్నిపరీక్ష ప్రీ-షో ఛాలెంజెస్‌లో అద్భుత ప్రతిభ చూపి అర్హత సాధించిన కామనర్ కంటెస్టెంట్ శాలిని కూడా ఈ సీజన్ ద్వారా హౌస్‌లోకి అడుగుపెడుతుండటం విశేషం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ప్రముఖ కమేడియన్ కృష్ణుడు, ముఖేష్ గౌడ, శాస్త్రి వంటి నటులు ఈ సీజన్ లో అలరించనున్నారు.

తాజాగా ఈ సీజన్ లేటెస్ట్ ప్రొమో కొద్దిసేపటి కిందటే విడుదలైంది. అక్కినేని నాగార్జున గొడ్డలి చేతపట్టుకుని ఎంట్రీ ఇచ్చారు. ఓ హ్యూమనాయిడ్ రోబో సైతం ఇందులో కనిపించింది. దశావతారం కాన్సెప్ట్ ఈ సీజన్ నుఎప్పటికప్పుడు కొత్త మలుపులు తిప్పే అవకాశం ఉంది. విభిన్న మనస్తత్వాలు కలిగిన ఈ కంటెస్టెంట్లు రానున్న వంద రోజులకు పైగా సాగే సుదీర్ఘ ప్రయాణంలో ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తారని ఆసక్తి రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+