Bigg Boss హౌస్ లో మేజికల్ కాంబినేషన్.. !!
ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. సరికొత్త హంగులతో గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ సారి హౌస్‌లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లు.. ఈ షోపై అంచనాలను భారీగా పెంచేస్తోన్నారు. సోషల్ మీడియా తారల నుండి వెండితెర, బుల్లితెర సెలబ్రిటీల వరకు విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయనున్నారు. తమ టాస్క్ తో షో ను హీటెక్కించనున్నారు. తొలి రోజే కంటెస్టెంట్ల ఎనర్జీ చూస్తుంటే రాబోయే రోజుల్లో ప్రేక్షకులకు అసలైన వినోదం అందడం ఖాయమనిపిస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, షార్ట్ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న వంశీ ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు డిజిటల్ స్క్రీన్‌పై అందరినీ నవ్వించిన వంశీ ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లో తన అసలైన వ్యక్తిత్వాన్ని, ఆటతీరును చూపించడానికి సిద్ధం అయ్యాడు.

వంశీతో పాటు బుల్లితెర రంగంలో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న షాలిని కూడా బిగ్ బాస్ వేదికపై మెరిసింది. అగ్నిపరీక్షను దాటుకుని ఈ మహా సంగ్రామంలోకి అడుగుపెట్టింది. తనదైన వ్యూహాలు, ఆటతీరుతో హౌస్‌లో బలమైన పోటీదారుగా నిలవడానికి ఆమె సిద్ధంగా ఉంది. షాలిని ఎంట్రీతో షోలో పోటీ మరింత తీవ్రతరమైనట్టే. ఈ సీజన్‌లో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తడానికి, ఆటాపాటతో వినోదాన్ని పంచడానికీ కామెడీ ఆర్టిస్ట్ రామ్ ప్రసాద్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు.
Reel avatharamtho manandharini entertain chesina #Vamsi🔥
— Starmaa (@StarMaa) September 6, 2026
Ippudu real avatharamtho asalaina aata modhalupettadaniki siddamga unnadu! 👁️
Watch the Grand Launch of #BiggBossSeason10, Playing Now only on #StarMaa#BiggBossTelugu10 #BiggBossTelugu10GrandLaunch pic.twitter.com/MDj5zPQt7s
మరో కంటెస్టెంట్ ఛైత్ర. పూర్తి స్థాయి ఎనర్జీతో హౌస్‌లోకి అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. స్టేజ్ పైనే సందడి చేసిన ఆమె.. ఈ సీజన్‌లో తన సత్తా ఏంటో నిరూపించుకోవడానికి సన్నద్ధమైంది. హౌస్‌లో జరిగే టాస్క్‌లలో విభిన్న ఎత్తుగడలతో ప్రత్యర్థులను చిత్తు చేయడానికి సిద్ధమని ప్రకటించింది. దీంతో ఆమె ఆట తీరు ఎలా ఉండబోతుందనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం తెలుగు లోగిళ్లు, డిజిటల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోందీ గ్రాండ్ లాంచ్ ప్రోగ్రామ్.
Full-on energy tho BIGG BOSS House loki adugu pettina #Chaithra 🔥
— Starmaa (@StarMaa) September 6, 2026
Thana aatatho chadhugudu aadadaniki siddamga undhi! 👁️
Watch the Grand Launch of #BiggBossSeason10, Playing Now only on #StarMaa#BiggBossTelugu10 #BiggBossTelugu10GrandLaunch pic.twitter.com/iKY15ZPfS5












Click it and Unblock the Notifications