Bigg Boss Telugu 9:కింగ్ నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Bigg Boss Telugu 9:బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9.మరికొన్ని రోజుల్లో ఈ మెగా రియాల్టీ షో ప్రారంభం కానుంది. ఇప్పటికే సామాన్యులను హౌజ్‌లోకి పంపించేందుకు చేయాల్సిన ఎంపిక ప్రక్రియ బిగ్‌బాస్ అగ్నిపరీక్ష పేరుతో ఓటీటీ వేదికగా చకచకా జరిగిపోతోంది. ఈ మినీ బిగ్‌బాస్ షోకు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ బాగానే వస్తోంది.ఈసారి బిగ్‌బాస్ తెలుగు మరింత ఎంటర్‌టెయినింగ్‌గా ఉంటుందని టాక్. ఇందుకు కావాల్సిన అన్ని జాగ్రత్తలు బిగ్‌బాస్ నిర్వాహకులు తీసుకున్నారని తెలుస్తోంది.

చదరంగం కాదు..రణరంగమే..
బిగ్‌బాస్ పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే వారు కింగ్ అక్కినేని నాగార్జున. హోస్ట్‌గా చాలా చక్కగా షోను క్యారీ చేస్తున్నారనే గుడ్ ఫీడ్ బ్యాక్ ఉంది. ఎప్పటికప్పుడు కింగ్ తన వేరియేషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్‌ ఫ్యాక్ట్ ప్రేక్షకులను తనవైపు తిప్పుకునేందుకు వారిని ఎంటర్‌టెయిన్ చేసేందుకు ఏమి చేయాలన్నా వెనుకాడరు నాగ్. ఇక త్వరలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్‌ సీజన్ 9కు కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు నాగార్జున. ఇప్పటికే వెన్నెల కిషోర్‌తో కలిసి చేసిన ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. ఈ సారి చదరంగం కాదు రణరంగమే అంటూ నాగ్ ఇప్పటికే షో పై అంచనాలను పెంచేశారు. గత కొన్ని సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా క్యారీ చేసిన నాగార్జున ఈ సారి కూడా అదే ఊపు మీద ఉన్నారు. ఇక వారానికి రెండు సార్లు మాత్రమే స్క్రీన్ పై కనిపించే నాగార్జున.. బిగ్‌బాస్ సీజన్‌కు తీసుకుంటున్న రెమ్యునరేషన్‌ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

bigg-boss-telugu-9-king-nagarjunas-shocking-remuneration-you-wont-believe-the-fee

కింగ్ రెమ్యూనరేషన్ ఎంతంటే..
వయస్సు పెరుగుతున్న కొద్దీ నవమన్మథుడిలా కనిపిస్తున్న నాగార్జున... ఈ సారి బిగ్‌బాస్ సీజన్ 9కు తీసుకుంటున్న రెమ్యునరేషన్ తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. గత సీజన్‌తో పోలిస్తే కింగ్ ఈసారి 75శాతం ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే తీసుకున్న రెమ్యూనరేషన్‌కు నాగ్ తప్ప మరెవరూ న్యాయం చేయలేరనే ఫీలింగ్ కూడా బిగ్‌బాస్ నిర్వాకుల్లో ఉంది. అందుకే ఇలాంటి మెగా రియాల్టీ షోకు హోస్ట్‌గా అక్కినేని అందగాడు అయితేనే బాగుంటుందని భావించిన నిర్వాహకులు ఎంతైనా ఇచ్చేందుకు వెనకాడటం లేదంటే నాగార్జునకున్న స్టామినా ఏంటో అర్థమవుతోంది.

ఇక అసలు విషయానికొస్తే కింగ్ నాగార్జున బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9కు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ రూ.35 కోట్లు అని తెలుస్తోంది. ఇప్పుడు స్మాల్ స్క్రీన్ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. గత సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన ఈ మన్మధుడు తీసుకున్న రెమ్యూనరేషన్ రూ.20 కోట్లు కాగా... తాజాగా టెలికాస్ట్ కాబోయే బిగ్‌బాస్ 9వ సీజన్‌కు రూ.35 కోట్లు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. అంటే ఇది గత సీజన్‌తో పోలిస్తే 75శాతం ఎక్కువ.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అదనంగా రూ.15 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఏంటి షాక్‌కు గురయ్యారా.. మైండ్ బ్లాకైందా.. అవును. మన్మధుడి స్టామినా అలాంటిది మరి. అయితే ఈ రెమ్యూనరేషన్‌పై ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు. కానీ నాగార్జునకు ఆ మాత్రం రెమ్యూనరేషన్ కచ్చితంగా ఉంటుందనే చర్చ మాత్రం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది.

ఇక బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్‌లో విజేతగా నిఖిల్ విజేతగా నిలవగా.. రన్నర్‌అప్‌గా గౌతం కృష్ణ నిలిచారు. ఈసారి కంటెస్టెంట్లు ఎవరో.. ఈ బిగ్ ప్రైజ్‌ను ఎవరు కొట్టుకెళుతారో తెలియాలంటే జస్ట్ కొంతకాలం వేచిచూడక తప్పదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+