Bigg Boss 9: రెండో వారం హౌస్ నుంచి బయటకు వచ్చేస్తోన్న కంటెస్ట్ ఎవరో తెలుసా..?

ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ రోజురోజుకు మరింత హీట్‌ను పెంచుతోంది. ముఖ్యంగా అగ్నిపరీక్ష ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టిన కామనర్ల కారణంగా ఈసారి బోలెడంత కంటెంట్ వస్తోంది. వారి పనుల వల్ల తరచూ గొడవలు, సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ వారం వీరంతా భరణిని టార్గెట్ చేయడంతో నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఊహించినట్టే, ఈసారి కామనర్లలో ఒకరు ఎలిమినేట్ అయ్యారు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, మర్యాద మనీష్ ఈ సీజన్ నుంచి నిష్క్రమించినట్లు తెలుస్తోంది.

ఈ వారం భరణిని మనీష్ ట్రీట్ చేసిన విధానం ఆడియన్స్‌కు ఏమాత్రం నచ్చలేదు. ప్రతి చిన్న విషయాన్ని పెద్ద సీఐడీ ఆఫీసర్ లాగా చూస్తూ, తను నమ్మిందే నిజమని వాదించడం ప్రేక్షకులను విసిగించిందని అంటున్నారు. అందుకే ఓట్ల ద్వారా అతన్ని బయటకు నెట్టేశారని విశ్లేషకులు చెబుతున్నారు.

Bigg Boss Telugu 9 Shocking Elimination - Manya Manish is Out

నిజానికి, మనీష్‌కు అగ్నిపరీక్ష సమయంలో కూడా ఆడియన్స్ నుంచి తక్కువ ఓటింగ్‌ లభించింది. అయితే, శ్రీముఖి అతన్ని హౌస్‌లోకి పంపడంతో మరో అవకాశం దొరికింది. మనీష్ టాస్కుల్లో నూటికి నూరు శాతం కష్టపడి ఆడుతున్నప్పటికీ, కొత్తగా ఏదో చేయాలనే తపన అతనికి రివర్స్ అవుతోంది. అతనికి బిగ్ బాస్ హౌస్‌లో ఉండే అర్హత ఉన్నప్పటికీ, పెద్దగా ఫ్యాన్ బేస్ లేకపోవడం వల్లే ఎలిమినేట్ కావాల్సి వచ్చిందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+