హీరోయిన్‌గా తెలుగు బిగ్ బాస్ బ్యూటీ: నాగ చైతన్య క్లాప్- బేబీ ప్రొడ్యూసర్‌తో..
హైదరాబాద్: అలేఖ్య హారిక అలియాస్ దేత్తడి హారిక. తెలుగు బిగ్ బాస్ సీజన్ 4తో ఆమె పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారు మోగిపోయింది. యూట్యూబర్‌గా సోషల్ మీడియాలో ఫేమస్. షార్ట్ ఫిలిమ్స్‌తో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఒకట్రెండు వెబ్ సిరీస్‌లల్లో మెరిసింది. యూట్యూబ్‌లో పలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తోంది.
ఇప్పుడామె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్‌లో మంచి అవకాశాన్ని అందిపుచ్చుకొంది. తెలుగులో ఓ సినిమా చేస్తోంది. సంతోష్ శోభన్ హీరో. సుమన్ పాతూరి దర్శకుడు. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ కింద సాయి రాజేష్ నీలం ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. కథ- స్క్రీన్‌ప్లే ఆయనే సమకూరుస్తోన్నారు ఈ మూవీకి.

ఇదివరకు సూపర్ హిట్ మూవీ బేబీకి దర్శకత్వం వహించారు సాయి రాజేష్. అది ఏ స్థాయిలో సూపర్ హిట్ అయిందో తెలిసిందే. విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని సమకూరుస్తోన్న ఈ సినిమాకు శ్రీనివాస కుమార్ నాయుడు (ఎస్‌కేఎన్) సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్నారు. గతంలో ఆయన బేబీ, ట్యాక్సీవాలా, ఈ రోజుల్లో.. వంటి సినిమాలను నిర్మించారు.

అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న నాలుగో సినిమా ఇది. ఈ ఉదయం ఫిల్మ్ నగర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అక్కినేని నాగచైతన్య క్లాప్ కొట్టాడు. ప్రీలుక్ పోస్టర్‌నూ ఆవిష్కరించారు. కొన్ని ప్రేమ కథలు జీవితకాలం వెంటాడుతాయి.. అనేది ఈ సినిమా కాన్సెప్ట్. దాదాపుగా సింగిల్ షెడ్యూల్‌లో ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications