బిగ్‌బాస్ హౌజ్లో గాలా ఈవెంట్..సందడి చేసిన ఇంటి సభ్యులు..
బిగ్ బాస్... బుల్లితెరపై తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టకుంటుందో. అయితే, బిగ్‌బాస్ హౌజ్లో ఉండే వారిలో ఎక్కువ శాతం సీరియల్ వాళ్లు కావడంతో బిగ్‌బాస్ హౌస్ కాస్త రెండు జట్లుగా మారిపోయింది. ఒకటి సీరియల్ టీమ్. మరోకటి ఇతరుల టీం అన్నట్లుగా ఉంది. ఇప్పుడు సీరియల్ టీం కాస్తా విడిపోయినట్లు అనిపిస్తోంది. గత వారం రోజులుగా బిగ్‌బాస్ ఇంట్లో పవర్ అస్త్ర అనే కాన్సెప్ట్ నడుస్తోంది. ఈ కాన్సెప్ట్‌లో భాగంగా బిగ్‌బాస్ హౌజ్మేట్స్‌కి కొన్నిటాస్కుల్ ఇస్తున్నాడు. అందులో భాగంగానే నేటి ఎపిసోడ్ ఉంటుంది. బిగ్‌బాస్ హౌజ్లో పవర్ అస్త్ర కోసం గాలా ఈవెంట్ జరుగుతోంది. ఇందులో భాగంగా ఇంటి సభ్యులంతా సందడి చేయడం ప్రారంభించారు.
గాలా పార్టీ..:ఈసారి ఇంట్లో పవర్ అస్త్ర కోసం గాలా పార్టీ నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు ఫిజికల్ టాస్క్‌లు ఇచ్చి వారిలో వారికి గొడవలు పెట్టిన బిగ్‌బాస్ పవర్ అస్త్ర మూడో కంటెస్టెంట్ కోసం మంచి ఎంటర్ టైన్మెంట్ అందించే ఏర్పాటు చేశారు. గాలా పార్టీలో ఎవరైతే క్రియేటివిటిగా ఆలోచించి అందరినీ మెప్పిస్తారో వారిలో ఒకరు పవర్ అస్త్ర కోసం పోటీ పడేందుకు నిలుస్తారని బిగ్‌బాస్ వెల్లడించారు. దీంతో ఇంట్లోని సభ్యులంతా తమలోని క్రియేటివిటీని బయటికి తీసే పనిలో పడ్డారు.

డిఫరెంట్‌గా రెడీ అయిన శుభశ్రీ..:దీనికోసం శుభశ్రీ కాస్త డిఫరెంట్‌గా రెడీ అయినట్లు కనిపిస్తోంది. శుభశ్రీ ఇంటిపనులు చేయకుండా ఎక్కువ సమయం రోటీలు చేస్తూ మాత్రమే కనిపించేదని సీరియల్ నటుడు అమర్ చాలా సార్లు ప్రస్తావించాడు. దాంతో శుభశ్రీ రోటీమేకర్‌గా రెడీ అయిపోయింది. చపాతీ కర్రలు చెవులకి జూకాలుగా తగిలించుకుని మెడలో చపాతీ చేసే పాన్ అన్నీ వేసుకుని విచిత్ర వేషధారణలో ఇంటి సభ్యులకు దర్శనమిచ్చింది. ఇక, ఇంటిసభ్యులను మెప్పించేందుకు జిగేల్ రాణి పాటకి డాన్స్ వేసి మంచి ఎంటర్ టైన్మెంట్ అందించింది.
శుభశ్రీ డ్యాన్స్ చూస్తుంటే హార్ట్ మెల్ట్ అయిపోతుందని సందీప్ అనడంతో తెగ సిగ్గుపడిపోతుంది శుభశ్రీ. ఇక, డ్యాన్స్ అనంతరం శుభశ్రీ మాట్లాడుతూ.. ఈ రోటీ కోసమే కదా నన్ను నామినేట్ చేశారు. అందుకే రోటీ మేకర్ లాగా మారాను అని అంటుంది. ఇక డాక్టర్ బాబు రేమో మాదిరిగా మారిపోయి డాక్టరమ్మతో డాన్స్ ఇరగదీసేస్తాడు. అబ్బాయిల నుంచి రక్షించమన్నారు కదా అని మోనిత మీద చేయి వేసి మాట్లాడేసరికి సందీప్ సరదాగా చేయి తియ్యి అని మాట్లాడతాడు.

దెయ్యం పిల్లలా మారిన ప్రియాంక..:ఇక, సీరియల్ నటి ప్రియాంక జైన్ మాత్రం దెయ్యం పిల్లలాగా రెడీ అయిపోయి ఇంట్లో సభ్యులను భయపెట్టేందుకు ట్రై చేసింది. కానీ, తన విచిత్ర వేషధారణ కాస్త ప్రేక్షకులను ఇరిటేట్ చేసే విధంగా అనిపించింది. భయంకరమైన మేకప్‌తో ప్రేక్షుకులకు విసుగుతెప్పించేలా ఉంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పటికి రిలీజ్ చేశారు.
సందీప్‌పై విరుచుకుపడ్డ అమర్..:సగం ఆడ, సగం మగవాడిగా వేషం వేసుకున్న అమర్ తన వంతుగా పెర్ఫామెన్స్ ఇచ్చేశాడు. ఇక ఈ గాలాకి సంచాలకుగా ఉన్న శివాజీ, శోభా శెట్టి, సందీప్ వారి నిర్ణయాలను ఇంటిసభ్యులకు బిగ్‌బాస్‌కు తెలియజేస్తారు. అందరి కంటే క్రియేటివ్ గా శుభశ్రీ ఉందని అనిపించిందని సందీప్ చెప్తాడు. ఆ మాటకి అమర్ దీప్ సీరియస్ అయిపోతాడు. ఎంటర్ టైనమెంట్ తను ఏం ఇవ్వలేదని అక్కడ ఏం అనిపించిందని గట్టిగా నిలదీస్తాడు అమర్. కావలసిన వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళడం కరెక్ట్ కాదని అరుస్తాడు. అక్కడ కాసేపు అమర్, సందీప్‌లు అరుచుకుంటారు. శుభశ్రీ ఇన్నోవేటివ్ గా అనిపించిందని శివాజీ చెప్పినా కూడ వినిపించుకోని అమర్ సీరియస్‌గా అరిచేసి వెళ్ళిపోతాడు.

గ్లాస్ ఈజ్ షార్ట్.. ఫిల్ ఇట్ ఫాస్ట్' టాస్క్..:అంతకుముందు ఇచ్చిన బిగ్ బ్యాంక్ టాస్క్ లో ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ గెలుస్తారు. ఈ సందర్భంగా బిగ్ బాస్.. 'గ్లాస్ ఈజ్ షార్ట్.. ఫిల్ ఇట్ ఫాస్ట్' అనే టాస్క్ ఇస్తారు. ఎవరైతే ఎక్కువగా ఏడ్చి కన్నీటిని ఆ గ్లాసులో నింపుతారో, ఆ టీమ్‌ని విజేతగా ప్రకటిస్తున్నట్లు బిగ్ బాస్ తెలిపాడు. అయితే, ఈ టాస్క్ అంతా చూపించలేదు. ఇప్పటికే లైవ్‌లో ఈ టాస్క్ చూసిన వారు మీమర్స్ ట్రోల్ చేయడంతో ఎక్కువ ఫూటేజ్‌ను టెలికాస్ట్ చేసినట్లుగా లేదు. చివరికి ఈ టాస్క్‌లో యావర్, పల్లవి ప్రశాంత్‌లు విజేతలుగా నిలిచారని బిగ్ బాస్ ప్రకటిస్తారు. ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్‌లు.. అమర్ దీప్, గౌతమ్ వద్ద ఉన్న కాయిన్స్ అన్నింటిని తీసుకుని విజేతలుగా నిలుస్తారు. వారిద్దరూ పవర్ అస్త్ర కంటెస్టెంట్‌ల స్థానంలో ఉంటారు.












Click it and Unblock the Notifications