Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బిగ్ బాస్ కంటెస్టెంట్ అమర్‌దీప్ కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి: ధ్వంసం

Bigg Boss Telugu Season 7: బిగ్‍ బాస్ తెలుగు సీజన్‍ 7 విన్నర్ ఎవరో అఫీషియల్‌గా తేలింది. ఆదివారం రాత్రి జరిగిన గ్రాండ్ ఫినాలేలో విన్నర్ పేరు వెల్లడైంది. రైతు బిడ్డగా గుర్తింపు పొందిన పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ విజేతగా నిలిచాడు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 టైటిల్ గెలుచుకున్నాడు.

అమర్‌దీప్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచాడు. శొంఠినేని శివాజీ, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, అంబటి అర్జున్.. ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు. అందరి కంటే ముందుగా ఈ గ్రాండ్ ఫినాలేలో అంబటి అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు. టఫ్ ఫైట్ ఇచ్చిన అతను ఆరో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Bigg Boss Telugu season 7 winner Pallavi Prashanth fans attacks on runner up Amardeep car

ఏకైక విమెన్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ అయిదో స్థానంలో నిలిచారు. అర్జున్ తరువాత ఆమె ఎలిమినేట్ అయ్యారు. చివరి నలుగురిలో ప్రిన్స్ యావర్ 15 లక్షల సూట్ కేస్ తీసుకొని ఫైనలిస్ట్ రేసు నుంచి వైదొలిగాడు. పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, శివాజీ టాప్ 3లో మిగిలారు. వారిలో శివాజీ మూడో స్థానానికి పరిమితం అయ్యాడు.

పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్.. చివరి రౌండ్‌ వరకూ నిలిచారు. వారిలో అత్యధిక ఓట్లను సాధించిన పల్లవి ప్రశాంత్‌ను విజేతగా ప్రకటించారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేని ఓ సామాన్య రైతు.. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ గెలుచుకోవడం పట్ల సోషల్ మీడియా ద్వారా అతనికి అతనికి విషెస్ చెబుతున్నారు.

గ్రాండ్ ఫైనల్ ముగిసిన తరువాత కలకలం చోటు చేసుకుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన అమర్‌దీప్‌ కారును పల్లవి ప్రశాంత్ అభిమానులు చుట్టుముట్టారు. కారు అద్దాలు పగలగొట్టారు. కారు దిగి రావాలంటూ తీవ్ర భయాందోళనలకు గురి చేశారు. కారు ముందుకు వెళ్లకుండా అడ్డుపడ్డారు. ఆ సమయంలో అమర్‌‌దీప్, ఆయన తల్లి, భార్య కారులోనే ఉన్నారు.

ఈ ఘటనతో అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అన్నపూర్ణా స్టూడియోస్‌కు చేరుకున్నారు. పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ అభిమానులను చెదరగొట్టారు. పల్లవి ప్రశాంత్ గెలిచాడంటూ శనివారమే వార్తలొచ్చాయి. దీనితో అతని అభిమానులు పెద్ద సంఖ్యలో అన్నపూర్ణ స్టూడియోస్‌కు చేరుకున్నారు.

పల్లవి ప్రశాంత్ గెలిచినట్లు అధికారికంగా ప్రకటించగానే స్టూడియో వద్ద సంబరాలు చేసుకున్నారు. అక్కడే ఉన్న అమర్‌దీప్‌ ఫ్యాన్స్‌తో గొడవకూ దిగారు. ఇది కాస్త కొట్టుకునేంత వరకూ వెళ్లింది. రోడ్డు మీద బాహాబాహీకి దిగారు. అదే సమయంలో అమర్‌దీప్ కారు స్టూడియో నుంచి బయటికి రావడంతో దాన్ని అడ్డగించి అద్దాలను పగులగొట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+