బిగ్ బాస్‌లో రచ్చ.. కళ్యాణ్ గొంతు పట్టుకున్న డీమోన్.. రాత్రుళ్లు అదే చేస్తావని రీతూపై సంజన ఫైర్..!

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో 'బిగ్‌బాస్'. ప్రస్తుతం సీజన్ 9 ఆద్యంతం ఆసక్తిగా సాగుతుండగా.. చివరి దశకు చేరుకుంటుంది. ఈ క్రమంలోనే నిన్నటి ( నవంబర్ 24, 11-2025 ) ఎపిసోడ్ ఫుల్ బ్లాస్ట్ అయ్యింది. బిగ్‌బాస్‌ వైల్డ్ ఫైర్ నామినేషన్స్ అంటూ మొదలుపెట్టగా.. హౌస్‌మేట్స్ అంతకుమించిన ఫైర్ చూపించారు. ముఖ్యంగా డీమాన్-కళ్యాణ్ మధ్య ఫిజికల్ ఫైట్.. రీతూ - కళ్యాణ్ మాటల యుద్ధం.. ఇక ఎపిసోడ్ చివరిలో రీతూ చౌదరి-సంజన మధ్య కూడా మాటల తూటాలు.. ఇలా మొత్తం కలిపి ఫుల్ ఫైర్ ఎపిసోడ్ నడిచింది అని చెప్పాలి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

సాఫీగానే కళ్యాణ్ - పవన్ నామినేషన్..

మందుగా నామినేషన్స్ లో కళ్యాణ్.. పవన్ ను నామినేట్ చేశాడు. కెప్టెన్ టాస్క్ నుంచి నిన్ను తీస్తే నవ్వుకుంటూ వస్తావేంటి. కెప్టెన్సీ కి నీకు అర్హత లేదు అని నిన్ను పంపించేస్తే నువ్వు నవ్వుకుంటూ వెళ్తున్నావు. కానీ నువ్వు లోపలికి గేమ్ చూపించుకోవడానికి వచ్చావ్. అదే నాకు ప్రాబ్లం అనిపించింది అంటూ చెప్పి నామినేట్ చేస్తాడు. మొత్తానికి కళ్యాణ్ పవన్ ను నామినేట్ చేయడం సాఫీగానే జరుగుతుంది.

bigg-boss-telugu-season-9-latest-episode-fight-between-sanjana-rithu-and-pawan-demon

పవన్ vs డీమోన్, రీతూ..

ఆ తర్వాత పవన్ ఇమ్మానుయేల్ ను నామినేట్ చేశాడు. అప్పుడు బ్లూ టీం గురించి రెడ్ టీం గురించి ఆర్గ్యుమెంట్ మొదలైంది. ఈ మాటల్లో నీది తప్పు అంటే నీది తప్పు అని కళ్యాణ్ - పవన్ మధ్య విపరీతమైన వాగ్వాదం జరిగింది. ఈ ఆర్గుమెంట్ లో భాగంగానే రీతూ కూడా మాట్లాడడంతో.. రీతూకి - కళ్యాణ్ కి మధ్య విపరీతమైన గొడవ జరిగింది. అయితే చూస్తుండగానే గొడవ తారాస్థాయికి చేరింది. దాదాపు కొట్టుకోవడం ఒకటే తక్కువ అనేట్టుగా గొడవ పడ్డారు.

ఈ తరుణంలోనే నీ గేమ్ నువ్వు ఆడట్లేదు తనకోసం ఆడుతున్నావు అని కళ్యాణ్ అనేసాడు. అయితే విపరీతమైన ఆర్గ్యుమెంట్ జరుగుతున్న టైం లోనే పవన్.. కళ్యాణ్ మెడ పట్టేసుకున్నాడు. దీంతో ఆపుతున్న ఇమ్మానుయేల్ సైతం షాక్ అవ్వగా.. వెంటనే పవన్ ఆపుతున్నాను అని చెప్పాడు. అయితే కళ్యాణ్ మెడ పట్టుకోవడం అనేది వెంటనే రిజిస్టర్ కాకపోయినా.. సంజనా కూడా వచ్చి పవన్ ను ఆపే ప్రయత్నం చేశారు. నీ మంచి గురించే ఆపుతున్నాను అంటూ చెప్పారు. ఇలా వారి గొడవ పీక్స్ కి చేరి ఆగింది.

సంజన vs రీతూ..

రీతూ చౌదరి నామినేషన్ లో భాగంగా సంజనను చేశారు. ఫైర్ స్ట్రోమ్ వచ్చినప్పటి నుంచి మీకేం అసలు కనిపించడం లేదు అని చెప్పుకొచ్చింది. నామినేషన్స్ లో ఇమ్మానుయేల్ ని నామినేట్ చేయలేనని కూడా చెప్పారని తెలిపింది. దీనికి వెంటనే సంజనా స్పందిస్తూ నేను ఇమ్మానుల్ ను నామినేట్ చేయను ఐ హేడ్ పర్సనల్ రీజన్స్ అని చెప్పింది. అలానే నామినేట్ లో తనుజ నువ్వు నాకు కాంపిటీషన్ అని అనుకుంటున్నాను అందుకనే నిన్ను నామినేట్ చేస్తున్నాను. నామినేట్ చేసిన కూడా మీరు వెళ్లిపోరు అని మీరు చెప్పారు. అలాంటప్పుడు మీరు ఎందుకు నామినేట్ చేశారని రీతు చౌదరి ప్రశ్నిస్తుంది. ఫైర్ స్ట్రోమ్ వచ్చిన దగ్గర నుంచి సేఫ్ గేమ్ ఆడుతున్నారని నామినేట్ చేస్తుంది.

అందుకు సంజనా మాట్లాడుతూ.. ఫైర్ స్ట్రామ్ సిక్స్త్ వీక్ లో వచ్చారు ఇప్పుడు 12వ వారానికి వచ్చాము. నేను కళ్ళు మూసుకొని నిద్రపోతే ఇక్కడ వరకు రాలేదని చెప్పింది. అంతే కాకుండా నీ అంత పెద్ద పెద్ద బూతులు నేను వాడను అని కౌంటర్ ఇచ్చింది. నేను ఏం బూతులు మాట్లాడాను అని రీతు చౌదరి అడిగింది. వచ్చారయ్యా పతివ్రత శిరోమణి అని ఎవరు చెప్పారు అని ప్రశ్నించింది సంజన. గాజులు ఏసుకుంటున్నారు అని ఎవరు ముందు చెప్పారు అని రీతు తిరిగి ప్రశ్నిస్తుంది.

అలా వారి మధ్య ఆర్గ్యుమెంట్ హీట్ ఎక్కింది. నీలాంటి స్ట్రాటజీలు కూడా ఎవరికి హౌస్ లో లేవు అని రీతుని అంటుంది సంజన. నువ్వు డెమోన్ తో రాత్రి కూర్చొంటావు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ మాట అనగానే ఇమ్మానుయేల్, భరణి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు మీ మాటలను వెనక్కి తీసుకోండి అని చెప్తారు. కానీ సంజనా మాత్రం వెనక్కి తగ్గకుండా తన వాదనలు వినిపిస్తుంది.

దీంతో రీతూ చౌదరి ఏడవడం మొదలుపెట్టింది. పక్కనుంచి తనుజ వస్తూ నీ తప్పు లేనప్పుడు ఏడవద్దు అంటూ మాట్లాడింది. ఏడుపు సొల్యూషన్ కాదని.. అడుగు అంటూ చెప్తుంది. మరోవైపు పవన్ కూడా నువ్వు మాట్లాడింది వెరీ రాంగ్ అక్క దాంట్లో ఏముంది అక్క అంటూ సంచనా తో మాట్లాడటం మొదలుపెట్టాడు. మామూలుగా మాట్లాడితే అయిపోద్ది కదా అలా ఎందుకు చెప్పడం అని మాట్లాడాడు పవన్. దీంతో ఈ వీరి మధ్య జరిగిన గొడవ చూస్తే.. కొన్ని వారాల క్రితం దివ్వెల మాధురి.. రీతూతో నీది డీమాన్‌ది అన్‌హెల్తీ రిలేషన్ అంటూ చేసిన కామెంట్స్ గుర్తొచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+