ఇండస్ట్రీలో ఇలాంటి చెత్త సినిమా మరొకటి రాదు..!

ఇటీవల కాలంలో సినిమా స్థాయి పెరిగింది. ఇండియన్ సినిమాలు సైతం అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాయి. అయితే కొన్ని సినిమాల్లో కంటెంట్ లేకపోయినప్పటికీ భారీగా నిర్మించి చేతులు కాల్చుకుంటున్నారు.భారీ బడ్జెట్‌తో నిర్మించబడి, అంచనాలకు తగ్గకుండా వసూళ్లు చేయలేకపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన 'భారతీయుడు 2' సినిమా భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది. అయితే, అంచనాలకు తగ్గకుండా వసూళ్లు చేయలేకపోయింది.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన 'కంగువా' సినిమా కూడా భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది. అయితే, బాక్సాఫీస్ వద్ద విఫలమైంది.రామ్ చరణ్ తాజాగా నటించిన గేమ్ ఛేంజర్ సైతం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా రూ.250 కోట్లకుపైగానే నిర్మాతకు నష్టాలను మిగిల్చింది.అయితే బాలీవుడ్ చరిత్రలోనే 'బాంబే వెల్వెట్'సినిమా అతి పెద్ద బిగ్ డిజాస్టర్‌గా నిలిచింది.

biggest flop movie in Bollywood

అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణబీర్ కపూర్, అనుష్క శర్మ ,కరణ్ జోహార్ ప్రధాన పాత్రలలో నటించారుకై కై మీనన్, మనీష్ చౌదరి, వివన్ షా , సిద్ధార్థ బసు సహాయక పాత్రలలో కనిపించారు. ఈ చిత్రం 15 మే 2015న విడుదలైంది.చరిత్రకారుడు జ్ఞాన్ ప్రకాష్ రాసిన "ముంబై టేబుల్స్" పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది.

ఈ చిత్రం 1969లలో బొంబాయి నేపథ్యంలో సాగుతుంది. ఒక సాధారణ వ్యక్తి ఎలా గొప్ప వ్యక్తిగా ఎదగాలని కలలు కంటాడు, దాని కోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కుంటాడు అనేది కథాంశం. ఈ సినిమా విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ నష్టాలను చవిచూసింది. రవీనా టాండన్, విక్కీ కౌశల్ గెస్ట్ రోల్స్ చేశారు. బాంబే వెల్వెట్ మూవీని రూ.115 కోట్లు పెట్టి తీస్తే, కేవలం రూ.43 కోట్లే వసూలు చేసింది.

తొలుత ఈ సినిమాను అనురాగ్ కశ్యప్ జాన్ అబ్రహం, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్‌తో తీయాలని ప్లాన్ చేశారు. కుదరకపోవడంతో రణబీర్ కపూర్‌తో సినిమాను పూర్తి చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. అయితే అమిత్ త్రివేది కంపోజ్ చేసిన పాటలకు మాత్రం మంచి పేరొచ్చింది.కథను అనేక పార్టులుగా తీయాలని చూడటం వల్లే బాంబే వెల్వెట్‌ ఫ్లాప్ అయిందని విశ్లేషకులు తేల్చేశారు. బాంబే వెల్వెట్‌ ఫ్లాప్ కావడంతో అనురాగ్ కశ్యప్ మిగిలిన భాగాలను పక్కన పెట్టేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+