ఈ ఏడాది అతి పెద్ద ఫ్లాప్ ఈ సినిమా ఇదే..!

ఇటీవల కాలంలో సినిమా స్థాయి పెరిగింది. ఇండియన్ సినిమాలు సైతం అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాయి. అయితే కొన్ని సినిమాల్లో కంటెంట్ లేకపోయినప్పటికీ భారీగా నిర్మించి చేతులు కాల్చుకుంటున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మించబడి, అంచనాలకు తగ్గకుండా వసూళ్లు చేయలేకపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన 'భారతీయుడు 2' సినిమా భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది. అయితే, అంచనాలకు తగ్గకుండా వసూళ్లు చేయలేకపోయింది.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన 'కంగువా' సినిమా కూడా భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది. అయితే, బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన 'బడే మియా చోటే మియా' సినిమా కూడా భారీ నష్టాలను మిగిల్చింది. అయితే ఈ సినిమాలను మించి మరో సినిమా అతి పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. ఆ సినిమా మరేదో కాదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్'.

biggest flop of in this this year

తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి అతిపెద్ద పండగ. ఈ పండగకు రిలీజయ్యే ఏ సినిమా అయినా మినిమమ్ గ్యారెంటీ హిట్ అవుతుందని పేరుంది. అయితే ఈ ఏడాది సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్', గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్', విక్టరీ వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిల్లో 'డాకు మహారాజ్','సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన 'గేమ్ ఛేంజర్' మాత్రం నెగిటివ్ టాక్ తెచ్చుకుని ఫ్లాప్‌గా నిలిచింది.

మెగా అభిమానులు సైతం ఈ సినిమాపై పెదవి విరిచారు. సినిమా ఏమాత్రం బాలేదని మెగా అభిమానులు చెప్పారంటే సినిమా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' సినిమా సైతం ఆయన కెరీర్‌లో అతి పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. సినిమాలో vfx వరస్ట్‌గా ఉన్నాయని అభిమానులు సైతం పెదవి విరిచారు.ఈ సినిమాకు సుమారు రూ.100 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.

ఇక మంచు విష్ణు నటించిన 'కన్నప్ప' సినిమా సైతం ప్లాప్‌ను మూటగట్టుకుంది. ఈ సినిమాకు రూ. 160 కోట్ల కంటే ఎక్కువ నష్టం వచ్చినట్లుగా కొన్ని ట్రేడ్ రిపోర్టులు పేర్కొన్నాయి. విడుదల కంటే ముందే సినిమాకు రూ.100 కోట్ల నష్టం వచ్చినట్లుగా కూడా ప్రచారం జరిగింది. సినిమాను సుమారు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించినట్లుగా నివేదికలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొత్తం వసూళ్లు సుమారు రూ.44.04 కోట్ల గ్రాస్ (₹33 కోట్ల నెట్) మాత్రమే ఉన్నట్లు ఒక నివేదిక పేర్కొంది.

దీంతో బడ్జెట్‌లో కేవలం 16.46% మాత్రమే రికవరీ అయినట్లు అంచనా. ఈ సినిమా పెద్ద డిజాస్టర్‌గా నిలిచినట్లుగా ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి.దీంతో ఈ ఏడాది అతి పెద్ద ఫ్లాప్‌గా కన్నప్ప నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+