మంచు మనోజ్‌కు పుట్టినరోజు.. గిఫ్టుగా మిరాజ్ సినిమా యూనిట్ గ్లింప్స్ రిలీజ్
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా 'మిరాజ్' సినిమా మేకర్స్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. హనుమాన్ ఫేమ్ హీరో తేజ సజ్జ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో మనోజ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీకి కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. మనోజ్ పుట్టినరోజు గిఫ్టుగా సోమవారం రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో మనోజ్ కత్తి పట్టిన ఓ యోధుడి పాత్రలో ప్రేక్షకులను కనువిందు చేయనున్నట్లు అర్థమైవుతోంది. 'దిస్ ఈజ్ ఎబౌడ్ బ్లాక్ స్వోర్డ్' అంటూ ప్రారంభమైన గ్లింప్స్ రక్తపు మడుగుల్లో ఉన్న కొన్ని మృతదేహాలను చూపిస్తూ ఆకట్టుకునేలా రూపొందించారు. బ్లాక్ స్వోర్డ్ ఈ ప్రపంచంలోనే ప్రమాదకరమైందని చెబుతూ యాక్షన్ సీన్స్‌తో మనోజ్‌ను ఓ రేంజ్‌లో చూపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా చాలారోజుల తర్వాత మనోజ్ సరికొత్త లుక్‌తో సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనుండడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
అరవై కోట్ల రూపాయల బడ్జెట్‌తో
మిరాజ్ సినిమాలో మనోజ్‌ది నెగిటివ్ రోల్ అని ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పటి వరకూ మనోజ్ పాత్రపై సినిమా యూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. అరవై కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో హీరో తేజ సజ్జ 'సూపర్ యోధ' పాత్రలో మెప్పించనున్నాడు. అలాగే, మనోజ్‌తోపాటు రితికా నాయక్, శ్రీరామ్ రెడ్డి, తాంజ నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తుండగా 2025 ఏప్రిల్ 25న థియేటర్లలోకి రానున్నట్లు ప్రకటించారు. ఇక ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతోపాటు కొరియన్ భాషల్లో తెరకెక్కుతోంది.













Click it and Unblock the Notifications