సమంత-నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగే కారణం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. గత తెలంగాణ ప్రభుత్వంలోని అధికారులు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలతో పాటు, సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు ఇప్పుటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో పోలీసులకు సంచలన విషయాలను వెల్లడించారని తెలుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు, ప్రముఖ కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగా ప్రణీత్ రావు అంగీకరించినట్టుగా సమాచారం అందుతోంది. రియాల్టర్లు, సినీ ప్రముఖుల ఫోన్ నెంబర్ల సైతం ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలు బయటపడటంతో మొత్తం ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాపింగ్‌కు గురైనట్టు అధికారులు గుర్తించారు. ఇక హైదరాబాద్‌లోని ప్రముఖ బిజినెస్ మ్యాన్లతో పాటు, రియాల్టర్ల నుంచి భారీ ఎత్తున డబ్బు వసూలు చేసినట్టు ఆధారాలు బయటపడ్డాయి.

ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సినిమా ఇండస్ట్రీని కూడా తాకిన సంగతి తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ యాక్టర్ల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. వీరిలో ఎక్కువగా హీరోయిన్ల నెంబర్లే ఉండటం సంచలనం సృష్టిస్తోంది. వీరితో పాటు ప్రముఖ యాంకర్ల ఫోన్ నెంబర్లపై కూడా ట్యాపింగ్ జరిగినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీ నుంచి ముంబైకి వెళ్లిన ఓ ప్రముఖ హీరోయిన్ నెంబర్‌ను సైతం హ్యాక్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఇక సమంత , నాగ చైతన్యలు విడిపోవడానికి ఈ ఫోన్ ట్యాపింగే కారణామాని వార్తలు వినిపించాయి.తాజాగా దీనిపై బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ స్పందించారు. నాగచైతన్య, సమంతల విడాకులకు కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూనే కారణమని సంచలన ఆరోపణలు చేశారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో మొదలైన ట్యాపింగ్ ఆపరేషన్ గతేడాది అసెంబ్లీ ఎన్నికల వరకూ కంటిన్యూ అయింది. తాజాగా ఈ వ్యవహారం వల్ల టాలీవుడ్ జంట విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని బూర నర్సయ్య గౌడ్ వ్యాఖ్యానించడం కొత్త వివాదానికి దారి తీస్తోంది.బూర నర్సయ్య గౌడ్ చేసిన కామెంట్స్. సినీ ,రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications