ఇబ్బందుల్లో స్టార్ హీరో, భార్య కోసం వెళ్లిన హీరోకు మైండ్ బ్లాక్, ఫోటోలు, సినిమాలు, వీడియోలతో !
స్యాండిల్ వుడ్ నటుడు, సెంచరీ స్టార్, హ్యాట్రిక్ హీరోగా పేరు సంపాధించుకున్న ప్రముఖ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్ మీద ఎన్నికల కమీషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో శివమొగ్గ నియోజక వర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సతీమణి గీతాను గెలిపించాలని అభిమానులకు, స్థానిక ఓటర్లకు హీరో శివరాజ్ కుమార్ మనవి చేస్తున్నారు.
కర్ణాటకలోని శివమొగ్గలో హీరో శివరాజ్ కుమార్ జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇదే విషయమై బీజేపీకి చెందిన కొందరు హీరో శివరాజ్ కుమార్‌పై ఎన్నికల కమీషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన నటుడు శివరాజ్ కుమార్‌పై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది.

తన భార్య గీతా శివరాజ్ కుమార్ కోసం ఎన్నికల ప్రచారం చేస్తున్న నటుడు శివరాజ్ కుమార్ ఫోటోలతో ఫ్లెక్స్, సినిమా పోస్టర్లు, వేస్తున్నారని, ఆ ప్రకటనలను నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. శివమొగ్గ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న భార్య గీతాను గెలిపించాలని ఎన్నికల ప్రచారానికి మద్దతుగా నిలిచిన నటుడు శివరాజ్ కుమార్‌పై బీజేపీ ఓబీసీ విభాగం నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
భద్రావతిలో తన భార్య గీతా కోసం ఎన్నికల ప్రచారం చెయ్యడానికి శివరాజ్ కుమార్ వెళ్లిన సమయంలో ఆయన అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు, పోస్టర్లు, వాల్ పోస్టర్లు అతికించారని బీజేపీ ఓబీసీ విభాగం నాయకులు ఆరోపించారు. ఇప్పుడు ఇదే విషయంలో హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్ మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. హీరో శివరాజ్ కుమార్ తో పాటు కర్ణాటక మంత్రి మధు బంగారప్ప, ఎమ్మెల్యే బీకే సంగమేశ్వర్ తదితరులు గీతా శివరాజ్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications