Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాలయ్య హీరోయిన్ కు లవ్ లెటర్ రాసిన 10వ తరగతి అబ్బాయి, పెళ్లి గ్యారెంటీ, అయితే మ్యాటర్ !

మలయాళం బోల్డ్ నటి హనీ రోజ్ సౌత్ ఇండియాలో చాలా ఫేమస్ అయిపోయింది. ఈ నటి హాట్ ఫోటోలు చూసి అబ్బాయిలకు పిచ్చెక్కిస్తోంది. తనకు తొలి ప్రేమలేఖ ఎప్పుడు వచ్చిందనే విషయాన్ని, పెళ్లి గ్యారెంటీగా చేసుకుంటాను అనే విషయాన్ని హనీ రోజ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. నటి హనీ రోజ్ పేరుకు తగ్గట్లే చాలా అందంగా, కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఈ మలయాళ బ్యూటీ హనీ రోజ్ గురించి చాలా మంది యువతకు తెలుసు. ఇటీవలకాలంలో హనీ రోజ్ సినిమాల్లో కాకుండా సోషల్ మీడియాలో ఎక్కువగా దర్శనమిస్తోంది. కళ్లు చెదిరే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న హనీ రోజ్ అబ్బాయిలకు నిద్రలేకుండా వారి ప్రశాంతతను చెడగొడుతోందని అందరూ సోషల్ మీడియాలో చిలిపిగా కామెంట్స్ చేస్తున్నారు. హనీ రోజ్ ఫొటోలే కాదు ఆమె మాటలు కూడా ఒక్కోసారి బోల్డ్‌గా ఉంటాయి.

Bold Malayalam actress Honey Rose spoke openly about her first love letter
దక్షిణ భారతదేశంలోని అన్ని బాషల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్న హనీ రోజ్ సొంత రాష్ట్రం కేరళ. మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ భాషల సినిమాల్లో నటించిన హనీ రోజ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం మలయాళ సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్న హనీ రోజ్ సినీ ప్రేమికుల అభిమాన నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తొలి ప్రేమలేఖ, పెళ్లి గురించి నటి హనీ రోజ్ ఓపెన్‌గా మాట్లాడింది.

1991 సెప్టెంబర్ 5వ తేదీన జన్మించిన మలయాళ నటి హనీ రోజ్ వర్గీస్ వయసు ఇప్పుడు 33 ఏళ్లు. 2005లో మలయాళంలో తెరకెక్కిన భాయ్ ఫ్రెండ్ అనే మలయాళ చిత్రంతో హనీ రోజ్ సినీ రంగ ప్రవేశం చేశారు. అయితే త్రివేండ్రం లాడ్జ్ అనే మలయాళం సినిమా హనీ రోజ్ సినీ కెరీర్‌ను కొత్త మలుపు తిప్పింది త్రివేండ్రం లాడ్జ్ ఊహించనిదానికంటే సూపర్ డూపర్ హిట్ కావడంతో మలయాళం సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా అబ్బాయిలకు ఆరాధ్య దేవత అయిపోయింది.

2012లో త్రివేండ్రం లాడ్జ్ సినిమా విడుదలైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హనీ రోజ్ తన పెళ్లి గురించి ఓపెన్‌గా మాట్లాడింది. భవిష్యత్తులో నా పెళ్లి కచ్చితంగా జరుగుతుందని, ఇంకా తనకు సరైన అబ్బాయి దొరకలేదని, నా మూడ్‌కి తగ్గ అబ్బాయి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని, అయితే అనుకున్నట్లుగా జరుగుతుందో లేదో తనకు తెలియదని హనీ రోజ్ ఓపెన్ గా చెప్పింది. తనకు సినిమాలంటే ఇష్టం అని, అందుకే సినిమాలు అంటే ఇష్టపడే వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని బోల్డ్ నటి హనీ రోజు స్పష్టం చేశారు.

Bold Malayalam actress Honey Rose spoke openly about her first love letter

ఈ విధంగా కాబోయే భర్త ఇష్టాలు, అయిష్టాలు అన్నీ తెలుసుకుంటానని, సహజంగా అతను కూడా తన ఇష్టాలను ఇష్టపడాలని, అందువల్ల రానున్న రోజుల్లో ఇద్దరి మద్య ఎలాంటి ఇబ్బందులు ఉండవని హనీ రోజ్ అన్నారు. మలయాళం బ్యూటీ హనీ రోజ్ తనకు వచ్చిన తొలి ప్రేమ లేఖ గురించి సంచలన విషయం బయటపెట్టింది. 6వ తరగతి చదువుతున్నప్పుడే హనీ రోజ్‌కి తొలి ప్రేమలేఖ వచ్చిందని ఆమె చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. 10వ తరగతి చదువుతున్న ఓ అబ్బాయి తొలిసారిగా నటి హనీ రోజ్‌కి ప్రేమలేఖ ఇచ్చాడని ఆమె స్వయంగా చెప్పింది.

ఆ అబ్బాయి ప్రేమలేఖ ఇచ్చిన ఆ క్షణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని నటి హనీ రోజ్ చెప్పింది. నటి హనీ రోజ్ ఆమె14వ ఏటనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఎక్కువగా మలయాళం సినిమాల్లో నటించింది. తమిళ్, కన్నడ, తెలుగు సినిమాల్లోనూ హనీ రోజ్ నటించింది. హనీ రోజ్ కన్నడలో నంజానాగూడు నంజుండా అనే సినిమాలో నటించి అక్కడి యువతను ఆకట్టుకుంది. తాజాగా నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలో హనీ రోజు నటించింది. అబ్బాయిల మనసు దోచుకున్న హనీ రోజ్ కు సోషల్ మీడియాలో విపరీతంగా అబ్బాయిల ఫోలోయింగ్ ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+