"మిరాయ్" సినిమాలో రాముడి పాత్ర చేసింది ఎవరంటే..?
యంగ్ హీరో తేజా సజ్జా హీరోగా.. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో "మిరాయ్" అనే చిత్రంలో నటించారు. ఇందులో విలన్ గా మంచు మనోజ్ నటించగా.. యంగ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్ గా చేసింది. సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ తో పాటు.. జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. రెండు రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.
క్లైమాక్స్‌లో గూస్‌బంప్స్..
సినిమాలో క్లైమాక్స్‌లో కనిపించే శ్రీరాముడి పాత్ర ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం రెండు నిమిషాల సీన్ అయినప్పటికీ, అది కథను మలుపుతిప్పే టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. రాముడి రోల్ వచ్చిన వెంటనే ప్రేక్షకులకు గూస్‌బంప్స్ వచ్చాయి. చాలా మంది ఈ పాత్రను ఏఐ (AI)తో సృష్టించారేమో లేదా ప్రభాస్ చేశారేమో అని ఊహించారు. ముఖ్యంగా తేజ సజ్జా రిలీజ్ కి ముందుగానే ప్రభాస్ సర్ప్రైజ్ ఉందని చెప్పడంతో, ఫ్యాన్స్ అంతా ఆయననే రాముడిగా ఊహించుకున్నారు.

అయితే ప్రభాస్ స్టార్టింగ్ లోనే వాయిస్ ఓవర్ ఇవ్వడంతో.. ఆ రోల్‌లో ఆయన లేరని చివరికి తేలిపోయింది. మూవీలో రెండు నిమిషాలు ఉన్న ఆ పాత్రను ముఖం కనిపించి కనిపించకుండా చూపించారు. దీంతో ఆ పాత్రను ఎవరు చేశారా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.
అసలు నటుడు ఎవరు?
మూవీలో రాముడి పాత్రలో కనిపించిన నటుడు బాలీవుడ్ యాక్టర్ గౌరవ్ బోరా. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన గౌరవ్ మాస్ కమ్యూనికేషన్స్ పూర్తి చేసి, నటనపై ఆసక్తితో ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ ఓ థియేటర్ గ్రూప్‌లో ఐదేళ్ల పాటు అనుభవాన్ని సొంతం చేసుకున్నాడు.
అనేక హిందీ నాటకాలు, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు చేసి, క్రమంగా చిన్న తెరపై పేరు సంపాదించాడు. గౌరవ్ ఇప్పటివరకు పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా మెరిశాడు. అందులో ముఖ్యంగా టీవీఎస్ ఐ క్యూబ్, సపోలా ఆయిల్, బజాజ్ ఫ్రీడమ్, టాటా క్యాపిటల్ వంటి పెద్ద బ్రాండ్స్‌కు సంబంధించి చేసిన ప్రకటనలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి.
దీంతో గౌరవ్ కు ఇప్పుడు మరిన్ని అవకాశాలు రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మంచు మనోజ్ చేసిన మహావీర్ లామా పాత్రకు కూడా మంచి స్పందన వస్తోంది. అలాగే తక్కువ బడ్జెట్‌లోనే అద్భుతమైన వీఎఫ్ఎక్స్ విజువల్స్ చూపించినందుకు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనిపై ప్రశంసలు కురుస్తున్నాయి.












Click it and Unblock the Notifications