హగ్ చేసుకొని, పెదాలపై ముద్దుపెట్టి.. తండ్రి ఇలాగే చేస్తాడని చెప్పారు - బాలీవుడ్ నటి

బాలీవుడ్ నటి అంజలి ఆనంద్ హిందీ ప్రేక్షకులకు సుపరిచితురాలే. తెలుగు ప్రేక్షకులకు ఆమె గురించి పెద్దగా తెలియకపోయినప్పటికీ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. చిన్నతనంలో తాను ఎదుర్కున్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టింది. తండ్రి అని చెప్పుకొనే వ్యక్తే తనను లైంగికంగా వేధించాడని ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

ఎనిమిదేళ్ల వయస్సులో తండ్రిని కోల్పోయానని తెలిపింది అంజలి. తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో కూడా తనకు తెలియదని.. కానీ ఆ తర్వాత తన జీవితంలోకి ఓ వ్యక్తి తండ్రి లాగా వచ్చాడని చెప్పుకొచ్చారు. చిన్నతనంలో సదరు వ్యక్తి తనను ఏదో చేయాలనీ ప్రయత్నించే వాడని.. ఆ వయస్సులో అతను ఏం చేస్తున్నాడో.. అర్ధం కాలేదని వాపోయింది. అలా ఎందుకు చేస్తున్నాడో అర్ధం అయ్యేది కాదని కన్నీటి పర్యంతం అయ్యింది. మొదట ఆ వ్యక్తి తనను హాగ్ చేసుకున్నాడని.. ఆ తరువాత తన పెదాలపై ముద్దుపెట్టాడని.. తండ్రి అంటే ఇలాగే చేస్తాడని చెప్పాడని వెల్లడించింది. అతను ఒక డ్యాన్స్ టీచర్ అని కూడా స్పష్టం చేసింది.

bollywood-actress-anjali-anand-open-up-about-physical-abuse-at-8-years-age

ఇక సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన అంజలి.. ధై కిలో ప్రేమ్, కుల్ఫీ కుమర్ర్ బజేవాలా వంటి సీరియల్స్ లో ప్రధాన పాత్ర పోషించింది. ఆ తరువాత కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ వేదికగా రిలీజ్ అయిన డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ లో షాహిదా పాత్రలో మెప్పించింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ షాకింగ్ కామెంట్స్ చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది.

ఇక ఆ తర్వాత తనను కంట్రోల్ లోకి తీసుకోవడానికి ప్రయత్నించాడని.. బట్టల విషయంలో నిబంధనలు పెట్టేవాడని చెప్పుకొచ్చింది. జుట్టు విషయంలో కూడా సీరియస్ గా ఉండే వారని.. స్నేహితులను కూడా కలవనిచ్చేవాడు కాదన తెలిపింది. ఆడపిల్లలు వేసుకొనే బట్టలు కాకుండా తన టీ షర్ట్ వేసుకోమనేవాడని.. తన మొదటి బాయ్ ఫ్రెండ్ సహాయంతో అతని నుంచి బయటపడ్డానని వెల్లడించింది. తన జీవితంలో నిజమైన ప్రేమ తన మొదటి బాయ్ ఫ్రెండ్ వల్లే దక్కిందని అంజలి చెప్పింది. అయితే పలు కారణాల వల్ల తాము విడిపోయామంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+