మెగాస్టార్ చిరంజీవి - శ్రీకాంత్ మూవీ కోసం రంగం లోకి బాలీవుడ్ బ్యూటీ..!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ తనదైన శైలిలో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం బింబిసారా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' మూవీ చేస్తున్నారు. ముగింపు దశకు చేరుకున్న ఈ మూవీ ఈ ఏడాదిలోనే సమ్మర్ కానుకగా విడుదల కానుంది. అలానే మరోవైపు అనిల్ రావిపూడితో సినిమాను రీసెంట్ గానే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలాతో మూవీ చేయనున్నారు. చిరంజీవి 158వ చిత్రంగా రాబోతుంది.
దసరాతో నానికి సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్.. ఈ సినిమా కోసం కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోయే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామలను రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నారట. గత కొంతకాలంగా ఈ చిత్రంలో రాణీ ముఖర్జీ నటించనున్నట్టు టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఆమె ప్లేస్ లో దీపికా పదుకొనేను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది.

ఇప్పటికే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన 'కల్కి 2898AD' సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది దీపికా. దాంతో చిరంజీవి సినిమాకు కూడా బాగా కలిసి వస్తుందని భావిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో సెకండ్ లీడ్ రోల్ కూడా ఉంటుందని, ఆ పాత్రకు రాణి ముఖర్జీని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరోవైపు మెగాస్టార్ 'విశ్వంభర' త్రిష, అషికా రంగనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్లు, వీడియోలు ఆడియన్స్ లో భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.
అలానే మెగాస్టార్ చిరంజీవి - డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గానే ఉగాది పర్వదినం సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందనున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని టాక్ నడుస్తోంది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications