కవల పిల్లలకు జన్మనివ్వనున్న రామ్ చరణ్ హీరోయిన్ ?.. హింట్ ఇచ్చేసిందిగా !
బాలీవుడ్ నటి కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ లో జర్నీ ప్రారంభించిందీ బ్యూటీ. అలా తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఫస్ట్ మూవీకే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ భామ. తన అందం, నటనతో ప్రేక్షకుల మనసులు దోచుకుంది. దీంతో కియారాకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలను సద్విని యోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. రామ్ చరణ్ తో వినయ విధేయ రామ చిత్రంలో మెరిసింది ఈ బ్యూటీ.
ఇక బాలీవుడ్ లో కబీర్ సింగ్ సినిమాతో పెద్ద హిట్ కొట్టింది కియారా. ఆ సినిమాలో ఆమె పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన గేమ్ ఛేంజర్ సినిమాలో నటించింది. ఈ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అయి డిజాస్టర్‌గా నిలిచింది ఈ మూవీ. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే షేర్షా సినిమాతో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో పడిందీ అమ్మడు. అలా రెండేళ్లపాటు డేటింగ్‌లో ఉండి ఫిబ్రవరి 7, 2023 న కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకున్నారు. ఇక కియారా అద్వానీ త్వరలో తల్లి కాబోతోన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమెకు సంబంధించిన బేబీ బంప్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా నెటిజన్లలో కియారాకు కవలలు పుట్టనున్నారా? మగబిడ్డనా? లేక ఆడబిడ్డనా ? అని సోషల్ మీడియాలో ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనికి కారణం గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలే కారణం.

గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో కియారా మాట్లాడుతూ.. తనకు కావాల్సినది ఇద్దరు ఆరోగ్యమైన పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అని చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్లు కియారాకు కవలలు పుట్టబోతున్నారని ఈమె వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు.
ఇక 2021లో విడుదలైన 'షేర్షా' సినిమాలో సిద్ధార్థ్ తో కలిసి కియారా నటించింది. అక్కడే పరిచయం ఏర్పడింది. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. దీంతో కుటుంబసభ్యుల సమక్షంలో 2023 ఫిబ్రవరి 7న కియారా- సిద్ధార్థ్ వివాహం చేసుకున్నారు. రాజస్థాన్ జైసల్మేర్ లోని సూర్య గఢ్ హోటల్ లో ఈ స్టార్ కపుల్ పెళ్లి ఘనంగా జరిగింది.












Click it and Unblock the Notifications