బాలీవుడ్ బ్యూటీ కారుకు ఘోర ప్రమాదం.. తలకు బలమైన గాయం !!!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, సెన్సేషనల్ డ్యాన్సర్ నోరా ఫతేహి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ముంబై నగరంలో ఆమె ప్రయాణిస్తున్న కారును మరో కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గోవాలో జరగనున్న ప్రముఖ మ్యూజిక్ ఫెస్టివల్ 'సన్‌బర్న్' కార్యక్రమానికి హాజరయ్యేందుకు నోరా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
మద్యం మత్తులో..
కాగా ప్రమాదానికి కారణమైన కారును వినయ్ సక్పాల్ (27) అనే వ్యక్తి నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడు మద్యం మత్తులో కారును నడిపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వేగంగా వచ్చి నోరా ఫతేహి కారును ఢీకొట్టడంతో ఆమె వాహనం తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వినయ్ సక్పాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

అయితే ప్రమాదం అనంతరం నోరా ఫతేహిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆమెకు తలకు స్వల్ప దెబ్బ తగలడంతో 'కంకషన్'కు గురైనట్లు వైద్యులు తెలిపారు. అంతర్గత రక్తస్రావం ఏమైనా ఉందా అనే అనుమానంతో డాక్టర్లు సీటీ స్కాన్ నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం తీవ్రమైన ప్రమాదం ఏమీ లేదని.. కేవలం స్వల్ప కంకషన్ మాత్రమేనని వైద్యులు స్పష్టం చేశారు. కొంత విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ, నోరా పరిస్థితి పూర్తిగా స్థిరంగానే ఉందని వెల్లడించారు.
ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. ఈ ప్రమాదం జరిగినప్పటికీ నోరా ఫతేహి తన వృత్తిపట్ల ఉన్న అంకితభావంతో అదే రాత్రి 'సన్‌బర్న్ 2025' వేదికపై ప్రదర్శన ఇచ్చారు. అంతే కాకుండా అక్కడే తన తదుపరి అంతర్జాతీయ మ్యూజిక్ సింగిల్ టీజర్‌ను కూడా ఆవిష్కరించారు. ప్రమాదం నుంచి బయటపడి కూడా స్టేజ్‌పై ఎనర్జీతో డాన్స్ చేయడం చూసి అభిమానులు, నెటిజన్లు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. సోషల్ మీడియాలో నోరా ధైర్యసాహసాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications